Last Updated:
Shocking News: చికెన్ మటన్ కంటే చాపలు తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. మన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్న చేపలు తినే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోయినా, కడుపులోకి వెళ్లేకా అదే అరిగిపోతుందిలే అని అశ్రద్ధ చేసిన, ముప్పులు తప్పవని వైద్యుల హెచ్చరిస్తున్నారు.
Shocking News: చికెన్ మటన్ కంటే చాపలు తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. మన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్న చేపలు తినే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోయినా, కడుపులోకి వెళ్లేకా అదే అరిగిపోతుందిలే అని అశ్రద్ధ చేసిన, ముప్పులు తప్పవని వైద్యుల హెచ్చరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో అనేకమంది చాపలు తింటూ ఆ ముల్లులు మింగేస్తున్న పరిస్థితి అధికమవుతుంది. కొన్ని కొన్నిసార్లు అదృష్టం కొలది ఏమీ జరగకపోయినా దాదాపు అనేక సార్లు ఆ ముల్లులు పేగుల్లో ఇరుక్కుని తీవ్ర ఇబ్బంది పాలు చేస్తున్నాయి. ఇలాంటి ఘటన ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం ఊడిమూడి గ్రామంలో ఓ వ్యక్తిని ఆసుపత్రి పాలు చేసింది. అసలు ఏం జరిగింది..?
అన్నం తినేటప్పుడు చాపముళ్ళు గొంతులో చిక్కుకుపోవడం లాంటి పరిణామాలు చాలా చూస్తాం. అయితే అవి చిన్న చిన్న ముళ్ళు వరకు ఒకే, కానీ కాస్త పెద్దవైతే మాత్రం ప్రమాదాలకు దారితీస్తున్నాయి. చాప ముల్లు మింగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కడుపునొప్పిగా ప్రారంభమై రకరకాల ఇబ్బందులకు దారితీస్తున్నాయి. అయితే ఈ సమస్య చాపముల్లు మింగడం ద్వారా వచ్చిందని గ్రహించని బాధితులు అనేక మందులు వాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం ఊడిమూడి గ్రామానికి చెందిన సత్యనారాయణ కొడుపు నోప్పి నిమిత్తం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.
వైద్యులు స్కాన్ చేసి తొలిత పొట్టలో ప్రేగు మడత పడిందిని, చిన్న ఆపరేషన్ జరుగుతుందని ప్రారంభించారు. తర్వాతగా పొట్ట ఓపెన్ చేసిన తర్వాత 5 అంగుళాల చాపముల్లు ఉండడంతో వైద్యులు అవాకయ్యారు. ఏది ఏమైనా చాకచక్యంతో పేగు మడత లో ఉన్న ఆ ఐదుఅంగుళాల ముళ్లను వైద్యులు తొలగించారు. నిజానికి ఇది గ్రహించక సాధారణ నొప్పి అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదికి వచ్చేది అని వైద్యులు పేర్కొంటున్నారు.
ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో చాపల ముల్లులతో ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు అనేకమైన జరుగుతున్నాయి.ఈ మధ్యకాలంలో కాకినాడ ఆసుపత్రిలో సైతం ఒక మహిళ ఇదే సమస్యపై చేరడం వైద్యులు ఆ ముల్లును తొలగించడం , తాజాగా కోనసీమలో సైతం ఇలాంటి ఘటన నెలకొంది. చాపల ఆరోగ్యమే కానీ తినేటప్పుడు తస్మాత్తు జాగ్రత్త ముల్లుల విషయంలో అంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
హెల్త్ టిప్స్, కిచెన్ టిప్స్, హోమ్ రెమిడీస్, పేరెంటింగ్ టిప్స్, రిలేషన్‌షిప్ గైడెన్స్, ఫిట్‌నెస్, యోగా టిప్స్, ట్రావెల్, ఫ్యాషన్, ఫుడ్ స్టోరీస్‌ని న్యూస్ 18 తెలుగు లైఫ్‌స్టైల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Kakinada,East Godavari,Andhra Pradesh


