సినిమా: ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన ‘ధురంధర’ సినిమాని ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన సంగతి తిలిసిందే. సినిమా విజయంపై ఆయన భార్య, నటి యామీ గౌతమ్ స్పందిస్తూ…కథ బాగుంటే సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పారు. దానికి ‘ధురంధర’ ఒక ఉదాహరణ అని అన్నారు. ఈ సినిమా విజయం ఆదిత్యలో ఎటువంటి మార్పు తీసుకురాలేదన్నారు. ‘సినిమా విషయంలో కీలక బాధ్యత దర్శకుడిదేనని నేను నమ్ముతాను. దీని విజయంలో స్క్రిప్ట్‌కే అధిక ప్రాధాన్యం. ఆదరణ పొందాలంటే కథ కచ్చితంగా బాగుండాలి. ‘ధురంధర’ విజయం కేవలం కొత్త రికార్డుల గురించి మాత్రమే చెప్పడం లేదు. థియేటర్లకు ప్రేక్షకులను తీసుకురావడానికి మనం ఎంతో కష్టపడుతున్న సమయంలో ఈ సినిమా అందరికీ ఒక విషయాన్ని స్పష్టం చేసింది. మంచి చిత్రాలు తీస్తే ఇప్పటికి కూడా థియేటర్ల వద్ద ప్రజలు బారులు తీరతారని చూపింది. మీరు అద్భుతమైన సినిమాలు తీయండి…మేము చూడడానికి సిద్ధంగా ఉన్నామని ప్రేక్షకులు మరోసారి రుజువు చేశారు’ అని యామీ గౌతమ్ అన్నారు. ఈ భారీ విజయం తర్వాత కూడా ఆదిత్య గతంలో ఉన్నట్లే ఉన్నారని యామీ అన్నారు. ‘ఈ సక్సెస్ మాలో మార్పు తీసుకురాలేదు. ఆదిత్య జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఉన్నాయి. కానీ ఎప్ప్పుడూ ఆయన తన సహనాన్ని కోల్పోలేదు. మా ఇద్దరికీ దేవుడిపై అపారమైన నమ్మకం ఉంది. మంచి చేసే వారికి మంచే జరుగుతుందని నమ్ముతాం. మనకు దక్కాల్సినది కొంచెం ఆలస్యం కావచ్చేమో కానీ, రాసిపెట్టి ఉంటే కచ్చితంగా దక్కుతుంది. ఆదిత్య ‘ధురంధర’కు ముందు ఎలా ఉన్నాడో ఇప్ప్పుడూ అలాగే ఉన్నాడు. ఈ విజయాల వల్ల ఆయన ప్రవర్తన మారలేదు’ అని యామీ చెప్పారు.
The post ‘ధురంధర’ విజయానికి కథే మూలం: యామీ గౌతమ్ appeared first on Visalaandhra.


