టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యా రెడ్డిల వివాహం బుధవారం రాత్రి తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో శాస్త్రోక్తంగా జరిగింది. ఈ వేడుకలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తిరుమల పర్యటనలో ఉన్న ఆయన, నేరుగా పెళ్లి వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. బెల్లంకొండ సురేష్ కుటుంబం భట్టి విక్రమార్కకు ఘనస్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రితో సాయి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ముచ్చటించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ వేడుకకు భట్టి విక్రమార్క రాకతో మరింత ప్రాధాన్యత లభించింది.
Source link


