Extramarital Affair: భర్త కళ్లుగప్పి ముగ్గురితో రిలేషన్‌షిప్.. బాయ్‌ఫ్రెండ్స్‌తో భార్య ప్రైవేట్ వీడియోలు చూసి భర్త షాకింగ్ డెసిషన్ | ట్రెండింగ్


Last Updated:

Extramarital Affair: అతనికి భార్య అంటే ఇష్టం. ఆమె చేసిన ఘోరమైన తప్పును క్షమించాడు. కాని తనను కాదని మరో ముగ్గురు మగవాళ్లతో పెట్టుకున్న వివాహేతర సంబంధం అతడ్ని తీవ్రంగా కలచి వేసింది. భార్య చేసిన నమ్మకద్రోహాన్ని మర్చిపోలేక చివరకు ఆ పని చేశాడు.

Extramarital Affair
Extramarital Affair

Extramarital Affair: భార్యలను మురిపించే వివాహేతర సంబంధాలు భర్తలకు ముళ్ల కంచెలుగా మారుతున్నాయి. హాయిగా సాగుతున్న కాపురాల్లో కంటికి రెప్పలా చూసుకుంటున్న భర్తలకు ఇవి గునపాల్లా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. పరాయి వ్యక్తుల పరిచయాలు, వ్యామోహంలో పడి వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న వాడ్ని నట్టేట ముంచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్ కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ బాచుపల్లిలో నివాసముంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం ఫిబ్రవరి నెలలో హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో దూకి సూసైడ్ చేసుకున్నాడు. అతను చనిపోయే ముందు రాసిన సూసైడ్ లెటర్ ఆధారంగా అతని చావుకు భార్య రేణుక కారణమని పోలీసులు తేల్చారు. ఏడాదిలో భర్తకు తెలియకుండా ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈవిషయం భర్తకు తెలియడంతో తీవ్రమనస్తాపానికి గురయ్యాడు. కట్టుకున్న భార్యను అమితంగా ప్రేమించిన సీతారాం.. ఆమెను ఏమి చేయలేక.. నిజం తెలిసి తట్టుకోలేక ఇద్దరు పిల్లల్ని అనాథల్ని చేసి ఈలోకం విడిచివెళ్లిపోయాడు.

భర్త కాదు ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్‌..

సమాజంలో సంబంధాలు, అనుబంధాలు ఏమైపోతున్నాయో అంతుచిక్కడం లేదు. నెలకు 2లక్షల రూపాయల జీతం కలిగిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జీవితంలో జరిగిన విషాద గాధ ఇప్పుడు అందర్ని షాక్‌కి గురి చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మార్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహం జరిగింది. వీళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సీతారాం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ జాబ్ చేస్తుండటంతో హైదరాబాద్ శివారు ప్రాంతంగా ఉన్న బాచుపల్లిలో ఫ్యామిలీతో నివసిస్తున్నాడు. అయితే సీతారాం భార్య రేణుక కట్టుకున్న వాడ్ని కాదని మరో ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతే కాదు వాళ్లతో కలిసిన రహస్యంగా తీసుకున్న ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో చూసి షాక్ అయ్యాడు సీతారాం.

ముగ్గురితో రిలేషన్‌షిప్..

ఈ దారుణ సంఘటన చూసి సీతారాం తట్టుకోలేకపోయాడు. భార్యను అమితంగా ఇష్టపడే వ్యక్తి కావడంతో ఆమెను శిక్షించకుండా.. 19 పేజీల సూసైడ్ లెటర్ రాసి అందులో తన భార్యను ఎలా చూసుకున్నానో.. తనను ఎందుకు మోసం చేసిందో అర్ధం కావడం లేదని వివరంగా రాసి ఫిబ్రవరి నెలలో హుస్సేన్ సాగర్‌లో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. సీతారాం చనిపోయే ముందు తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న రమణారెడ్డి అనే వ్యక్తితో కలిసిన ప్రైవేట్ వీడియోలను రమణారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో భర్త కంటపడింది. అంతే తన భార్య నిజస్వరూపం తెలిసి ఆ దారుణాలు చూడలేక సూసైడ్ చేసుకున్నట్లుగా లెటర్‌లో పేర్కొన్నాడు.

భార్య కాదు పిశాచి..

సీతారాం రాసిన సూసైడ్ లెటర్ చూసిన ప్రతీ ఒక్కరి మనసు కదిలించే విధంగా ఉంది. తన భార్య రేణుకకు ఏలోటు రాకుండా చూసుకున్నానని .. కానీ ఆమె ఏడాదిన్నరలోనే ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుందని స్వయంగా సీతారాం లేఖలో పేర్కొన్నాడు. అంతేకాకుండా ప్రైవేట్ వీడియోలను రికార్డు చేసుకోగా.. ఓ లవర్ దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినట్లుగా తెలిపాడు. ఆ దారుణాలను చూసి తాను ఎలా తట్టుకోగలగాలి.. అసలు రేణుకకు ఏం కావాలి. ప్రేమనా లేక శృంగారమా? అని ప్రశ్నిస్తూ ప్రాణాలు తీసుకున్నాడు.

లెటర్‌లో బయటపడ్డ నిజం..

సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు భార్య రేణుకతో పాటు ఆమె ఇద్దరు లవర్స్ రమణారెడ్డి, శ్రవణ్ లను అరెస్ట్ చేశారు పోలీసులు. రేణుక తాత్కాలిక ఆనందాలు, శారీరక సుఖం కోసం భర్తకు చేసిన నమ్మకద్రోహానికి ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారని అతని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *