మొదట ఇల్లు, భవనం వివరాలు నమోదు చేయాలి. ఇందులో భవన నంబర్, జనగణన హౌస్ నంబర్ నమోదు చేయాలి. ఇంటి నేల, గోడలు, పైకప్పు ఏ పదార్థాలతో నిర్మించబడ్డాయో ఎంపిక చేయాలి. ఇవి మట్టి, ఇటుక, సిమెంట్, చెక్క, టైల్స్, ఆస్బెస్టాస్ షీట్స్ వంటి కోడ్‌ల రూపంలో ఉంటాయి. తర్వాత ఆ ఇల్లు ఎలా ఉపయోగంలో ఉందో నమోదు చేయాలి. నివాసంగా ఉందా, నివాసం తో పాటు ఇతర పని కోసం వాడుతున్నారా, షాప్, ఆఫీస్, స్కూల్, ఫ్యాక్టరీగా ఉందా లేక ఖాళీగా ఉందా అని చెప్పాలి. ఇల్లు నివాసంగా ఉంటే దాని పరిస్థితి కూడా నమోదు చేయాలి. మంచి స్థితి, నివసించదగిన స్థితి, కూలిపోయే స్థితి అనే ఎంపికలు ఉంటాయి. (image: census portal)



