రజనీకాంత్ సినిమాలో బసిల్ జోసెఫ్?


హైదరాబాద్: రజనీకాంత్ హీరోగా తెరకెక్కనున్న ‘తలైవా 173’ (వర్కింగ్ టైటిల్)లో బసిల్ కీలక పాత్ర పోషించే అవకాశాలున్నా యంటూ కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ‘సూక్ష్మదర్శిని’, ‘పొన్‌మ్యాన’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులనూ థ్రిల్ చేసిన మలయాళ నటుడు బసిల్ జోసెఫ్. బసిల్ ఇచ్చిన హింట్‌తో ఆ రూమర్లకు బలం చేకూరినట్లైంది. ఓ వేడుకలో పాల్గొన్న బసిల్…తన తదుపరి చిత్రాల గురించి మాట్లాడుతూ తమిళంలో ఓ పెద్ద ప్రాజెక్టులో భాగం కాబోతున్నానని తెలిపారు. త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చన్నారు. దీంతో, బసిల్ ‘తలైవా 173’ గురించే మాట్లాడి ఉంటారని అభిమానులు అనుకుంటున్నారు. ఈ చిత్రంలో బసిల్… రజనీకాంత్ తనయుడిగా యాక్ట్ చేసే ఛాన్స్ ఉందని కోలీవుడ్ వర్గాల సమాచారం. రజనీకాంత్ 173వ సినిమాకి కమల్ హాసన్ నిర్మాత. ఈ చిత్రానికి ‘డాన’ ఫేమ్ శిబి చక్రవర్తి దర్శకత్వం వహించను న్నారు. డైరెక్టర్‌గానూ బసిల్‌కు మంచి క్రేజ్ ఉంది. సూపర్‌హీరో మూవీ ‘మిన్నల్ మురళి’తో సత్తా చాటిన ఆయన… సూపర్‌మ్యాన్ తరహా కథతో అల్లు అర్జున్‌తో ఓ సినిమాని తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం వార్తలొచ్చాయి. అల్లు శిరీశ్ పెళ్లి వేడుకకు బసిల్ హాజరుకావడంతో సినిమా దాదాపు ఖరారైనట్టే అని సినీ వర్గాలు భావించాయి. దీనిపై అధికారికంగా ఎటువంటి అప్‌డేట్ లేదు. బసిల్ నటించిన తమిళ్ మూవీ ‘రావడి’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

The post రజనీకాంత్ సినిమాలో బసిల్ జోసెఫ్? appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *