Egg Price: సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన కోడిగుడ్డు ధర |


ఎండాకాలం వస్తే చాలు.. కోడిగుడ్ల ధరలు పెరిగిపోతాయి. ఉత్పత్తి తగ్గిపోతుంది. దానికి తోడు విదేశాలకు ఎగుమతి జోరుగా సాగుతోంది. దాంతో డిమాండ్‌కి తగిన సప్లై లేకపోవడం వల్ల ఏపీ, తెలంగాణలో కోడిగుడ్ల ధరలు బాగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో ఒక గుడ్డు ధర రూ.7 దాకా ఉంది. హోల్‌సేల్‍‌లో కొనేవారికి రూ.6.30కి లభిస్తోంది. ఇలా గుడ్డు ధర పెరగడం వల్ల హోటళ్లలో ఎగ్ ఆమ్లెట్, ఎగ్ దోసె, ఎగ్ ఫ్రైడ్‌రైస్ వంటి వాటి ధరలు పెరుగుతున్నాయి. కర్రీ పాయింట్లలో కూడా ఎగ్ కర్రీ, ఎగ్ బుర్జీ ధరలు పెరుగుతున్నాయి. ఐతే.. చికెన్ ధర మాత్రం కంట్రోల్‌లో ఉంది. ప్రస్తుతం స్కిన్‌లెస్ కేజీ రూ.250 నుంచి రూ.270 మధ్య ఉంది. ఇరాన్ యుద్ధ సమయంలో ఈ ధర రూ.400కి చేరింది.

ఇలాంటి మరిన్ని అప్‌డేట్స్ కింద ఉన్నాయి చూడండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *