Petrol Shortage in Andhra Pradesh | “నో స్టాక్” బోర్డులతో ఏపీ బంకులు ఖాళీ..కిలోమీటర్ల మేర క్యూ! |


Last Updated: Apr 27, 2026, 16:21 IST

ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. సోమవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 420కి పైగా బంకులు మూతపడగా, విజయవాడలో పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ధరలు పెరుగుతాయన్న భయంతో జనం బంకులకు పోటెత్తారు. విజయవాడలోని ఆటోనగర్, బెంజిసర్కిల్, ఎంజీ రోడ్డులో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. స్టాక్ తక్కువగా ఉండటంతో బంకు నిర్వాహకులు రేషనింగ్ పద్ధతిని అమలు చేస్తున్నారు (టూవీలర్లకు ₹300, కార్లకు ₹1,000 వరకు మాత్రమే). పరిస్థితిని గమనించిన సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి, సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. ప్రజలు ఆందోళనతో అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *