దర్శకురాలు గీతూపై ప్రశంసలు కురిపించిన హీరో యశ్
హైదరాబాద్: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రానున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘టాక్సిక’. టీజర్ విడుదలైన నాటి నుంచి ఈ సినిమాపై విపరీతమైన చర్చ నడుస్తోంది. మార్చిలో విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ కారణంగా వాయిదా పడింది. జూన్ 4న విడుదల కానున్నట్లు చిత్ర బందం తాజాగా వెల్లడించింది. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో ‘టాక్సిక’లోని సన్నివేశాల గురించి యశ్ ఇటీవల అమెరికాలో జరిగిన ‘సినిమాకాన’ వేడుకలో మాట్లాడారు. ఈ యాక్షన్ చిత్రాన్ని ఒక మహిళా దర్శకురాలు తెరకెక్కిస్తున్నందువల్ల సరికొత్తగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా దర్శకురాలు గీతూ మోహన్ దాస్‌పై ప్రశంసలు కురిపించారు. ‘సాధారణంగా గ్యాంగ్‌స్టర్ డ్రామాలు అంటే పురుష దర్శకులే బాగా చేస్తారనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ, ఈ గ్యాంగ్‌స్టర్ కథను ఒక మహిళా కోణంలో చూపించడం అనేది చాలా కొత్తగా ఉంటుంది. ఇందులోని శృంగార సన్నివేశాల నుంచి యాక్షన్ సీన్స్ వరకు ప్రతి దానిలోనూ ఆమె ఆలోచనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సున్నితమైన భావాలను ఎంత హృద్యంగా చూపించారో… యాక్షన్ సన్నివేశాలను అదే స్థాయిలో తెరకెక్కించారు. అన్నిరకాల భావోద్వేగాలను మహిళా దర్శకురాలు ఇంత బాగా ప్రజెంట్ చేయగలరా అని ఆమెతో ప్రయాణించాకే నాకు అర్థమైంది. ఇందులోని సన్నివేశాలు గతంలో చూడనివిధంగా విభిన్నంగా ఉంటాయి. గీతూ గొప్ప రచయిత, ఆమె నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’ అని యశ్ అన్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో ఐదుగురు హీరోయిన్లు…నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణీ వాసంత్ నటిస్తున్నారు.
The post భిన్నమైన సన్నివేశాలతో ‘టాక్సిక’ appeared first on Visalaandhra.


