Last Updated:
విశాఖపట్నం కైలాసపురంలో అక్రమ సంబంధం వివాదంతో ఆటో డ్రైవర్ ప్రశాంత్‌ను శ్రీను కత్తితో హత్య చేశాడు, పోలీసులకు లొంగిపోయాడు, కేసు దర్యాప్తులో ఉంది
విశాఖపట్నం నగరంలో మరోసారి అక్రమ సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కైలాసపురం ప్రాంతంలో నిన్న రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న సీతారామ కళ్యాణ మండపం వద్ద ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నంకి చెందిన శ్రీను సోదరికి తుని ప్రాంతానికి చెందిన వ్యక్తితో పెళ్లి అయింది. వీరిద్దరికీ మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఈ క్రమంలో తునిలో పరిచయమైన ప్రశాంత్‌తో ఆమె సహజీవనం చేస్తూ కైలాసపురంలో ఉంటున్నారు. నగరంలో ప్రశాంత్ (32) వృత్తిరీత్యా ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు.
ఈ మధ్య కాలంలో ప్రశాంత్ మద్యం తాగి తన అక్కను కొడుతున్నాడని శ్రీను మందలించాడు. ఈ విషయం పై పలుమార్లు ప్రశాంత్‌ను హెచ్చరించాడు. తన అక్కకు దూరంగా ఉండాలని, పద్ధతి మార్చుకోవాలని గొడవ పడ్డాడు. అయినప్పటికీ ప్రశాంత్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో శ్రీను కక్ష పెంచుకున్నాడు.
సమయం కోసం వేచి చూసిన శ్రీను, కైలాసపురం సీతారామ కళ్యాణ మండపం వద్ద ప్రశాంత్ ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు. వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో ప్రశాంత్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రమైన గాయాలు కావడంతో ప్రశాంత్ అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి మృతి చెందాడు. శ్రీను వెంటనే పోలీసులకు లొంగిపోయాడు.
సమాచారం అందుకున్న ఫోర్త్ టౌన్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు వాడిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో కైలాసపురం ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Apr 25, 2026 11:12 AM IST



