28న రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ ఫుట్ బాల్ టోర్నమెంట్ ను పక్కాగా నిర్వహించాలి


: జేసి సి.విష్ణు చరణ్

విశాలాంధ్ర అనంతపురం టౌన్ : రాష్ట్రస్థాయి శాప్ లీగ్ ఫుట్ బాల్ టోర్నమెంట్ 2026ను ఈనెల ఏప్రిల్ 28 నుండి 30వ తేదీ వరకు అనంతపురం జిల్లా కేంద్రంలో ఆర్డిటి స్టేడియం నందు నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను జిల్లా సంయుక్త కలెక్టర్ సి. విష్ణు చరణ్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 నిర్వహణపై అధికారులతో జాయింట్ కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ఈ ఫుట్ బాల్ క్రీడా పోటీలలో అండర్ 15 మరియు అండర్ 21 బాలురు మరియు బాలికలకు పోటీలు నిర్వహిస్తారని, సుమారు 2000 మంది క్రీడాకారులు పాల్గొంటారని, ఇందులో 28 జిల్లాల నుండి ప్రాతినిధ్యం ఉంటుందని, ప్రతి జిల్లా నుండి 72 మంది వరకు క్రీడాకారులు పాల్గొంటారని, సదరు క్రీడా పోటీల నిర్వహణ ఆర్డిటి స్టేడియం నందు గల మూడు గ్రౌండ్లలో నిర్వహించబడునని తెలిపారు. పోటీలో పాల్గొనటకు వచ్చే క్రీడాకారులకు, అమ్మాయిలకు విన్సెంట్ డి పాల్ మరియు ఆర్డిటి నందు వసతి ఏర్పాటు, బాలురకు రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్ నందు వసతి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వసతి మరియు క్రీడా ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి ఏర్పాటు, మరుగుదొడ్లు, ఎలక్ట్రిసిటీ మరియు క్రీడాకారులను తరలించుటకు వాహనాల ఏర్పాటు తదితర ఏర్పాట్లు అన్ని పక్కాగా ఉండాలని, జిల్లా స్పోర్ట్స్ అభివృద్ధి అధికారి సమన్వయం చేసుకోవాలని, సంబంధిత అధికారులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇందులో ఫైనల్ క్రీడల్లో విన్నర్, రన్నర్లకు ట్రోఫీ అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి మంజుల, కడప స్పోర్ట్స్ స్కూల్ కో ఆర్డినేటర్ మరియు స్పెషల్ ఆఫీసర్ జగన్నాథ్ రెడ్డి, ఆన్ సెట్ శ్రీనివాస్, తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *