AP Budget 2026 Live Updates: ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ.. బడ్జెట్ ప్రవేశ పెడుతున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Andhra Pradesh Budget 2026 Live: నేడు ఫిబ్రవరి 14న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.  ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మూడో బడ్జెట్‌గా నిలవనుండగా, మొత్తం వ్యయం సుమారు రూ.3.35 లక్షల కోట్ల నుంచి రూ.3.45 లక్షల కోట్ల మధ్య ఉండొచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ బడ్జెట్‌లో ఎన్నికల హామీల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సూపర్ సిక్స్ పథకాలతో పాటు పోలవరం ప్రాజెక్టు, సాగునీటి విస్తరణ, అమరావతి అభివృద్ధి, రహదారులు, ఇతర మౌలిక వసతులపై ప్రధాన కేటాయింపులు ఉండే అవకాశముంది. మూడు ఆర్థిక మండలాలు, రాయలసీమ ఉద్యాన హబ్ వంటి ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.

బడ్జెట్ అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ వివరాలను వెల్లడిస్తారు. మండలిలో సాధారణ బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్‌ను సంబంధిత మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. సంక్షేమ రంగానికి కూడా భారీ నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. దీపం 2.0, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా వంటి పథకాలతో పాటు పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఉండొచ్చని ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. రాష్ట్ర ప్రజలు ఈ బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *