Vivek Oberoi at Tirumala | తిరుమలలో వివేక్ ఒబెరాయ్ సందడి.. శమితా శెట్టితో కలిసి శ్రీవారి దర్శనం!



బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, నటి శమితా శెట్టిలు గురువారం (ఏప్రిల్ 23) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ (TTD) అధికారులు వారికి వేద ఆశీర్వచనం అందించి, పట్టు వస్త్రాలతో సత్కరించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం ప్రతిసారీ తనకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని వివేక్ ఒబెరాయ్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. వీరితో పాటు మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం రాజేంద్ర శుక్లా కూడా నేడు స్వామివారిని దర్శించుకోవడం గమనార్హం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *