తిరుపతిలో దివ్య పుష్పయాగం: మూడు టన్నుల పుష్పాలతో ప్రత్యేక పూజలు.

తిరుపతి: ఊంజల్ మండపంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య పుష్పయాగం వైభవంగా జరిగింది. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగింది.

స్వామివారికి ప్రత్యేకంగా పుష్పయాగం నిర్వహించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా తులసి, చామంతి, మల్లె, గన్నేరు, కనకాంబరాలు, రోజా, తామర, కలువ వంటి 12 రకాల పుష్పాలతో పాటు ఆరు రకాల ఆకులను ఉపయోగించారు. మొత్తం మూడు టన్నుల పుష్పాలను ఈ యాగంలో వినియోగించారు.

పుష్పాల పరిమళంతో ఆలయ ప్రాంగణం సుగంధభరితంగా మారింది. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు ఈ వేడుకను ఎంతో భక్తిశ్రద్ధలతో వీక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *