వేసవి సెలవుల్లో విద్యార్థులు తగు జాగ్రత్తలు పాటించాలి..


తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉండాలి.. ఎం ఈ ఓ గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; వేసవి సెలవుల్లో విద్యార్థులు తగు జాగ్రత్తలు పాటించాలని, తల్లిదండ్రుల సంరక్షణలో నే ఉండాలని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయని తెలిపారు. ఈ సెలవుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఎటువంటి పరిస్థితులలో ఆదనపు తరగతులు నిర్వహించరాదని వారు తెలిపారు. విద్యార్థులు ఎండాకాలంలో ఎండ అధికంగా ఉన్నందున ఎవరు బయటకు తిరగరాదని తెలిపారు. అదేవిధంగా చెరువుల వద్ద గుంటల వద్ద బావుల వద్ద ఈతకు వెళ్ళరాదని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తప్పకుండా మీ పిల్లల పట్ల తగు జాగ్రత్తలతో ఉంటూ, వారిని సంరక్షిస్తూ ఉండాలని తెలిపారు. అదనపు తరగతులు ఎవరైనా నిర్వహిస్తే మాకు సమాచారం ఇవ్వాలని వారు తెలిపారు. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల వారు కచ్చితంగా పాటించాలని మరోసారి వారు హెచ్చరించారు.

The post వేసవి సెలవుల్లో విద్యార్థులు తగు జాగ్రత్తలు పాటించాలి.. appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *