హైదరాబాద్: అభిమానులు ఎప్ప్పుడెప్ప్పుడా అని ఎదురు చూస్తున్న తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘జైలర్ 2’ షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలుపుతూ చిత్ర బందం కొన్ని ఫొటోలు పంచుకుంది. మాఫియా, ప్రతీకార నేపథ్యం, కుటుంబ అంశాల మేళవింపుగా రూపొంది ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న ‘జైలర’ చిత్రానికిì కొనసాగింపుగా ‘జైలర్ 2’ వస్తోన్న సంగతి తెలిసిందే. అగ్రహీరో రజనీకాంత్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు ఈ చిత్రాన్ని. భారీ స్థాయిలో ఇది రానున్నట్లు చిత్ర బందం తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే విడుదల తేదీని టీమ్ వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. విడుదలకు సిద్ధమవుతోన్న వేళ ఇటీవల ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు లీక్ కావడం చిత్ర యూనిట్‌ను ఆవేదనకు గురిచేసింది. ‘జైలర్-2’ సెట్లో తీసిన కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో ప్రచారమయ్యాయి. ఈ వీడియోను షేర్, ప్రచారం చేసిన ఖాతాలకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు చేపట్టడంతో పాటు బయటకు వచ్చిన సన్నివేశాల వీడియోను ఆ ఖాతాల నుంచి తొలగించడానికి అవసరమైన చర్యలను చేపట్టినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. జైలర్ 2 దిలీప్ కుమార్ రచన, దర్శకత్వంలో రాబోతుంది. ఇది ఫుల్ తమిళ్ యాక్షన్, కామెడీ చిత్రం. దీనిని సన్ పిక్చర్స్ బేనర్‌పై కలానిధి మారన్ నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకత్వంలో రూపొందింది.
The post ‘జైలర్ 2’ షూటింగ్ పూర్తి appeared first on Visalaandhra.


