అడవిలో ఆవు, గుహలో దైవ దర్శనం.. భక్తులను కదిలిస్తున్న దేవరకొండ కథ..!Devarakonda Avu Katha Viral Shivaparvatula Appearance Devotees Belief. | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

దేవరకొండలో మొగిలప్ప కాపరి ఆవు పుట్టకు పాలు ఇస్తుండగా శివపార్వతులు ప్రత్యక్షమయ్యారన్న కథ భక్తుల నమ్మకానికి ప్రతీకగా, నిత్య అన్నదానం కొనసాగుతోంది.

+

దేవర

దేవర కొండ చరిత్ర ఎప్పుడైనా విన్నారా లేకుంటే లోకల్ 18 స్క్రీన్ పై  ఓ లుక్ వేయండి.

పుట్టకు పాలు ఇస్తున్న ఆవు కథలు మనం సినిమాల్లో, పురాణాల్లో తరచుగా వింటుంటాం. అలాంటి గాథ నిజంగా జరిగినట్టుగా స్థానికులు నమ్మే ఓ ఆధ్యాత్మిక కథ ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశమైంది. ఈ విశేష గాథ చిత్తూరు జిల్లా పరిసరాల్లోని దేవరకొండ ప్రాంతానికి సంబంధించినది. భక్తుల నమ్మకానికి ప్రతీకగా నిలిచిన ఈ కథ వినేవారిని ఆధ్యాత్మిక భావంలో ముంచెత్తుతోంది.

స్థానికంగా చెప్పుకునే కథనం ప్రకారం, అడవి ప్రాంతంలో పశువులను మేపే నాయని మొగిలప్ప అనే కాపరి దగ్గర ఉన్న ఒక ఆవు ప్రతిరోజూ పాలు ఇవ్వకుండా తప్పించుకునేది. యజమాని రోజూ మందలించడంతో కాపరి అనుమానం పెంచుకున్నాడు. ఒక రోజు ఆ ఆవును గమనిస్తూ వెంబడించాడు. సాయంత్రం చీకట్లు కమ్ముకుంటుండగా ఆవు కొండపై మెట్ల మార్గం దాటి ఒక గుహలోకి వెళ్లింది. ఆశ్చర్యపోయిన కాపరి నిశ్శబ్దంగా లోపలికి వెళ్లి చూసిన దృశ్యం అతని జీవితాన్నే మార్చేసిందని చెబుతారు.

గుహలో పుట్ట పక్కన ఆవు నిలబడి పాలు కారుస్తుండగా, అక్కడ శివపార్వతులు ప్రత్యక్షమై ఉన్నారని కాపరి గ్రహించాడట. మనుషుల వాసన వస్తోందని పార్వతీదేవి చెప్పగా, అతను నా భక్తుడే అని శివుడు సమాధానం ఇచ్చాడని స్థానిక గాథ చెబుతోంది. కాపరిని ఉద్దేశించి “నీకు ఏమి కావాలి కోరుకో” అని అడగగా, అతను “నాకు ఎప్పుడూ మంచి భోజనం దొరికేలా చేయండి” అని కోరాడట. “నీవు తలచుకుంటే భోజనం సిద్ధమవుతుంది” అని ఆశీర్వదించారనే నమ్మకం ఉంది.

ఆ దివ్య అనుభవం తర్వాత ఆ ప్రాంతంలో భక్తులు కలిసి నిత్య అన్నదానం ప్రారంభించారని చెబుతారు. సుమారు పదేళ్లుగా భక్తుల సహకారంతో అక్కడికి వచ్చే వారికి ప్రతిరోజూ అన్నదానం కొనసాగుతోందని స్థానికులు గర్వంగా చెబుతున్నారు. గుహ మార్గం, వెండి ధ్వజస్తంభాలు, కొండపై ఆలయ వాతావరణం.. ఇవన్నీ కలిపి దేవరకొండను ప్రత్యేక ఆధ్యాత్మిక కేంద్రంగా నిలబెడుతున్నాయి. పురాణాల్లో విన్న గాథ నిజ జీవితంలో వినిపిస్తే ఎలా ఉంటుందో చూపించే ఈ దేవరకొండ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భక్తి, నమ్మకం, దైవ అనుగ్రహం కలిసిన ఈ గాథను తెలుసుకోవడానికి భక్తులు కూడా ఆసక్తి చూపుతున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *