Heatwave Warning: ఏప్రిల్‌లో 50డిగ్రీలు టచ్ అవడం పక్కా.. ఈసారి ఎండలకు డీప్ ఫ్రై అవ్వాల్సిందే, జాగ్రత్త | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

Heatwave Warning: ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మే మాసం రావకముందే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఏపీలో నమోదవుతున్నాయి అంటే ఇక ముందు ముందుకు 50 డిగ్రీల వరకు ఎండలు నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తుంది.

+

Heatwave

Heatwave Warning

Heatwave Warning: ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మే మాసం రావకముందే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఏపీలో నమోదవుతున్నాయి అంటే ఇక ముందు ముందుకు 50 డిగ్రీల వరకు ఎండలు నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత 24 గంటల్లో కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి నెలకొన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. అంతకుమించి పల్నాడు ప్రకాశం మార్కాపురం రాయలసీమ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట, గురుకుపల్లి, గుమ్మలక్ష్మీపురం, జిఎం వలస,కొమరాడ,  కుర్పాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం, వీరఘట్ట మండలాల్లో తీవ్ర వడగలుపులు ప్రభావం చూపే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

ఈసారి ఎండలకు డీప్ ఫ్రై అవ్వాల్సిందే..

కొన్నిచోట్ల విభిన్న వాతావరణఏపీలో కొన్నిచోట్ల 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే కొన్నిచోట్ల వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఏది ఏమైనా ఎండల ప్రభావం ఏప్రిల్ నెల ఆఖరిలో అత్యధికంగా ఉంటాయని ప్రజలు జాగ్రత్తలు వహించాలంటూ పేర్కొంటున్నారు. ముఖ్యంగా కడప 45 డిగ్రీలు నంద్యాల ఆళ్లగడ్డలో 44. 3°, అనంతపురం తెరనపల్లిలో 44. 1 డిగ్రీ సెల్సియస్ తిరుపతి వరదయ్యపాలెంలో 43. 5 డిగ్రీల సెల్సియస్ మార్కాపురం కొమరోలు 43 డిగ్రీల ఎండలు నమోదు అయినట్లు తెలిపారు.

ఓవైపు మాడిపోయే ఎండలు..మరోవైపు వర్షాలు..

గోదావరిజిల్లాలో సైతం రికార్డు స్థాయిలో భానుడు తన ప్రతాపాన్ని చూపించడంతో రహదారులు వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. ఎండ దాటికి స్కూల్ విద్యార్థులు ప్రజలు సైతం ఇబ్బందులు పెడుతున్నారు, ముఖ్యంగా శీతల పానీయాలు సేవిస్తూ సేద తీరుతున్నారు , అలాంటి తరుణంలోనే శీతల పానీయాలు కాదు కొబ్బరి బోండాలు మజ్జిగ మాత్రమే తాగాలంటూ కోనసీమ జిల్లాకు సంబంధించిన స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి. ఏదేమైనా రాబోయే ఐదు రోజుల్లో రికార్డు స్థాయిలో ఎండలు ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేస్తుంది. దీని ప్రభావంతో నిత్య కార్మికులైన రిక్షా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు పచ్చని చెట్ల కిందకి వచ్చి సేద తీరుతున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *