విమాన పైలెట్‌ను రక్షించే ఆపరేషన్‌పై గోప్యత
అధ్యక్షుడికి సమాచారం ఇవ్వని అధికారులు
వాషింగ్టన్: ఇరాన్ భూభాగంలో ఇటీవల అమెరికా ఎయిర్‌మన్ రెస్క్యూ ఆపరేషన్ విషయంలో అమెరికా మిలిటరీ అధికారులు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సైతం తెలియ కుండా గోప్యంగా వ్యవహరించినట్లు సమాచారం. ఆ సమయంలో దేశాధ్యక్షుడు ట్రంప్ నకూ అధికారులు పూర్తి వివరాలు వెల్లడించలేదని మీడియా కథనాలు వెల్లడించాయి. ట్రంప్ గతంలో వ్యవహరించిన తీరును దృష్టిలో ఉంచుకొని వారు ఆయనకు పరిమిత సమాచారం మాత్రమే అందుబాటులో ఉంచినట్లు తెలిసింది. ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్ ఇరాన్ భూభాగంపై కూలడంతో అమెరికాకు కంటిమీద కునుకులేకుండా పోయింది. ఒక పైలట్‌ను వెంటనే కాపాడినా.. అదే విమానంలో మరో పైలట్ (వెపన్ ఆఫీసర్) జాడ మాత్రం తెలియలేదు. ఇక ఆ సైనికుడిని కాపాడేందుకు అమెరికా భారీ ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. అమెరికా మిలిటరీ, నేషనల్ సెక్యూరిటీ అధికారులు 24 గంటలపాటు ఈ ఆపరేషన్‌ను నేరుగా పర్యవేక్షించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దాని వివరాలు ఆయనకు ఇచ్చినప్పటికీ.. అసలు అది ఎలా సాగుతోందనే దానిపై ప్రతి విషయాన్ని ఆయనకు క్షుణ్ణంగా తెలియజేయలేదట. ఆ వివరాల ఆధారంగా ట్రంప్ ఏవైనా మాటలు మాట్లాడితే, ఆపరేషన్‌కే ఎసరు తేవచ్చనే ఆందోళనతోనే ఆయనకు పరిమిత సమాచారమే ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఇరాన్లో విమానం కూలడంతో ట్రంప్ తన సహాయకుల తీవ్రంగా గద్దించారట. ఆ ఘటనపై ఆయన తీవ్ర ఆందోళన చెందారని ఓ మీడియా కథనం వెల్లడించింది. ఇరాన్ భూభాగంలోకి వెళ్లి, ఆ సైనికుడిని తీసుకురావడం ఎంత క్లిష్టమైందో తెలిసినప్పటికీ వెంటనే అతడిని తీసుకురావాలని ఒత్తిడి తీసుకువచ్చారట. ఇది తన రాజకీయ జీవితంలో అతిపెద్ద విపత్తుగా మిగిలిపోతుందేమోనన్న భయం ట్రంప్‌లో కనిపించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆయన అసహనం ఆపరేషన్ ప్లానింగ్‌నే దెబ్బతీయొచ్చని భావించడం వల్లే అధికారులు ఆపరేషన్ నిర్వహించే రూమ్‌కు ఆయన్ను కొన్ని గంటల పాటు దూరంగా ఉంచారని సమాచారం. కేవలం ఫోన్లోనే ఆయనకు అరకొర సమాచారం ఇచ్చారట. ఆ ఆపరేషన్‌ను ఉపాధ్యక్షుడు జేడీవాన్స్, వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, పెంటగాన్, నిఘా సంస్థల అధికారులు, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్టాఫ్ పర్యవేక్షించారు. ఇక ఆ రెండో సైనికుడిని కూడా కాపాడినట్లు సమాచారం ఇచ్చిన తర్వాతే ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ీVAర్మూజ్ గురించి ఇరాన్‌ను హెచ్చరిస్తూ అభ్యంతరకర భాషతో పోస్టు పెట్టారు.


