స్పష్టం చేసిన ఇరాన్
తెహ్రాన్: పశ్చిమాసియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇస్లామాబాద్ వేదికగా నిర్వహించ తలపెట్టిన రెండో విడత శాంతి చర్చలకు తాము హాజరు కావడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికాతో చర్చలకు ప్రతినిధులను పంపడం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. అమెరికా`ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరికొన్ని గంటల్లో ముగియనున్న వేళ ఇరాన్ ఈ ప్రకటన చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటి నుంచి దాన్ని అమెరికా ఉల్లంఘిస్తూనే ఉందని విదేశాంగ శాఖ అధికారప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ పేర్కొన్నారు. ీVAర్మూజ్ వద్ద నౌకలను దిగ్బంధించడం, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఇరాన్‌కు చెందిన కార్గో షిప్‌ను అదుపులోకి తీసుకోవడం వంటి సంఘటనలను ప్రస్తావించారు. ఒకవేళ అమెరికా దాడులకు పాల్పడితే అదే స్థాయిలో తమ నుంచి సమాధానం ఉంటుందని హెచ్చరించారు. అమెరికాతో జరిగే ఏ చర్చలకైనా హాజరయ్యే ప్రణాళికలు తెహ్రాన్‌కు ఇంకా లేవని తెలిపారు. అయితే ఇరాన్ చర్చలకు హాజరయ్యే అవకాశాన్ని ఆయన తోసిపుచ్చలేదు.
అమెరికా మీడియా గేమ్‌లో భాగం
అమెరికా ప్రకటించిన రెండో దఫా శాంతి చర్చలను ‘ఇది అమెరికా మీడియా గేమ్‌లో భాగం’ ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఆరఎనఏ ప్రకటన చేసింది. ‘అమెరికా మితిమీరిన డిమాండ్లు, అవాస్తవ అంచనాలు, తరచూ వైఖరిలో మార్పులు, పదే పదే విరుద్ధ ప్రకటనలు చేస్తోంది. అంతేకాదు, నౌకాశ్రయ దిగ్భందం కూడా కొనసాగుతున్న కాల్పుల విరమణ ఉల్లంఘనే అవుతుంది. ఇస్లామాబాద్‌లో రెండో దశ చర్చలు జరుగుతాయన్న వార్తలు అసత్యం. ఇది అమెరికా మీడియా గేమ్, ఒత్తిడి తేవడానికి చేస్తున్న ఆరోపణల ఆటలో భాగం’ ఇరాన్ మీడియా అని తెలిపింది. ఇదే సమయంలో పాకిస్థాన్ ప్రధానని షెహబాజ్ షరీఫ్ ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మధ్య టెలిఫోన్ సంభాషణ జరిగింది. ప్రాంతీయ పరిస్థితులపై ఇద్దరు నాయకులు చర్చించారు. సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ నాయకులతో జరిగిన తన చర్చల వివరాలను షెహబాజ్ షరీఫ్ పంచుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స’లో పోస్ట్ చేశారు. అటు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా ఫోన్లో మాట్లాడారు. అమెరికా-ఇరాన్ మధ్య విభేదాలను తగ్గించేందుకు తాము కృషి చేస్తున్నట్లు అరాగ్చీకి చెప్పారు.
అమెరికా ఆశావాదం
ఇదిలా ఉండగా, ఇరాన్?తో కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలపై అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఒప్పందానికి దూరంగా లేమని తెలిపారు.
జలసంధిపై నియంత్రణ కోసం కొత్త చట్టం
అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ీVAర్మూజ్ జలసంధిపై మరింత పట్టు బిగించాలని ఇరాన్ చూస్తోంది. ఈ మేరకు జలసంధిపై నియంత్రణను కట్టుదిట్టం చేసే కొత్త చట్టాన్ని ఇరాన్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరాన్ పార్లమెంటరీ సివిల్ ఇంజనీరింగ్ కమిటీ ఛైర్మన్.. మహమ్మద్ రెజాయ్ కూచీ ఈ ప్రకటన చేశారు. ఇజ్రాయిల్‌కు చెందిన నౌకలపై పూర్తి నిషేధంతో పాటు ఈ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై కఠిన నిబంధనలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కొత్త ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేసిందన్నారు. ఈ ముసాయిదా చట్టం తుది రూపం దాల్చే దశకు చేరుకుందని వెల్లడించారు. త్వరలోనే దీనిని ఇరాన్ పార్లమెంట్ ఆమోదించనున్నట్లు రెజాయ్ చెప్పారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే ఇజ్రాయిల్‌తో సంబంధం ఉన్న నౌకలను ీVAర్మూజ్ గుండా ప్రయాణించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ఇరాన్ శత్రుదేశాలుగా పరిగణించే దేశాల నౌకలు ప్రయాణించాలంటే ఆ దేశ జాతీయ భద్రతా మండలి నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. గతంలో ఇరాన్‌కు నష్టం కలిగించిన దేశాల నౌకలు ఆ నష్టపరిహారాన్ని చెల్లించే వరకు జలసంధి గుండా ప్రయాణించడానికి వీలుండదు. జలసంధి గుండా వెళ్లే నౌకలు తమ రవాణా రుసుమును కేవలం ఇరాన్ కరెన్సీలో చెల్లించాల్సి ఉంటుంది.
The post అమెరికాతో చర్చల్లేవ్ appeared first on Visalaandhra.


