విశాలాంధ్ర, యాడికి:యాడికి మండలంలోని బోయరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఉన్న అదానీ సిమెంట్ ఫ్యాక్టరీలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో పవన్ కుమార్ రెడ్డి మృతి చెందాడు.ఫ్యాక్టరీ మైన్స్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో టిప్పర్ వాహనం ఢీకొనడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాడికి సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి, సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.


