తమిళనాడులో చంద్రబాబుకి శృంగ భంగం తప్పదు- సిపిఐ.నారాయణ ఫైర్


తిరుప‌తి : తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రచారం చేస్తున్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శృంగభంగం తప్పదని సిపిఐ నారాయణ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడు రాష్ట్రంలోని తెలుగు భాష బోధించే పాఠశాలను మూసేస్తామని అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చినప్పుడు తమిళనాడు రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి తెలుగు ప్రజలు దీనిపై స్పందించాలని చంద్రబాబు నాయుడు గారిని నేరుగా కలిసి విన్నవించుకున్నా పట్టించుకోని చంద్రబాబు నాయుడు ప్రస్తుతం మోడీను కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెల్లడం విడ్డూరమని,నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని, అప్పట్లో తెలుగు స్కూల్ ల మూసివేత పై తలీ నియోజకవర్గం ఎమ్మెల్యే రామచంద్రన్ గట్టిగా జయలలిత ప్రభుత్వంతో కొట్లాడి తీర్మానాన్ని వెనక్కి తీసుకునేలా చేశారని ఆ విషయాన్ని ఏ ఒక్క తెలుగు ప్రజలు గానీ మర్చిపోయి ఉండరని చంద్రబాబు నాయుడు మోడీని ఎంత వెనకేసుకొచ్చినా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల కూటమి ఏ గెలుపొందుతుందని మొత్తానికి చంద్రబాబు కి తమిళనాడులో శృంగభంగం తప్పదని ఎద్దేవా చేశారు.

The post తమిళనాడులో చంద్రబాబుకి శృంగ భంగం తప్పదు- సిపిఐ.నారాయణ ఫైర్ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *