తిరుమలలోని అనేక ప్రాంతాల్లో టీటీడీ తిరునామ సేవను ఉచితంగా అందిస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, క్యూ కాంప్లెక్స్-2, గొల్లమండపం, రామ్ భగీచా, బేడి ఆంజనేయస్వామి ఆలయం, కల్యాణకట్ట, సుపథం, వరాహస్వామి ఆలయం, నాలుగు మాడ వీధులు, అన్నప్రసాద కేంద్రం, విశ్రాంతి గృహాలు వంటి ప్రాంతాల్లో భక్తులకు తిరునామధారణ చేస్తున్నారు. ఈ సేవ కోసం రోజుకు రెండు షిప్టుల్లో దాదాపు 168 మంది శ్రీవారి సేవకులు విధులు నిర్వహిస్తున్నారు.



