దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరంజిత్ సింగ్ సంధుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో భారత్ తరఫున అమెరికాలో రాయబారిగా పనిచేసిన సంధు, భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని ట్రంప్ పేర్కొన్నారు.
ఈ విషయాన్ని ఆయన ట్రూత్ సోషల్ వేదికగా షేర్ చేసిన పోస్టులో వెల్లడించారు. దిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులైన తరణ్‌జీత్ సింగ్ సంధుకు అభినందనలు. అనుభవజ్ఞుడైన దౌత్యవేత్తగా, అమెరికా మాజీ రాయబారిగా భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల బలపాటుకు ఆయన చూపిన నిబద్ధత ప్రశంసనీయమని ట్రంప్ కొనియాడారు. సంధు నాయకత్వంలో దిల్లీ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ, ఆయనతో కలిసి దిగిన ఫొటోను కూడా పంచుకున్నారు.


