స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయంలో తమిళ ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తమిళ ఉగాది సందర్భంగా ఆలయంలో రోజంతా ఆర్జిత సేవలు నిలిపి వేయడం జరిగింది. సుమారు 13 వేలు మంది పై చిలుకు భక్తులు స్వామి వారిని దర్శించుకొన్నట్టు తెలిపారు. తమిళ ఉగాది పర్వ దినాన స్వామి వారికి విశేష అలoకరణ చేపట్టి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామి వారికి వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు.
Source link


