ఇంటర్ ఫలితాల్లో మెరిసిన శ్రీ చరణ్ తేజ్


విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నార్పల మండలానికి చెందిన “ఆంధ్రజ్యోతి” రిపోర్టర్ శంకర్ కుమారుడు శ్రీ చరణ్ తేజ్ ప్రతిభావంతుడిగా నిలిచారు. మొత్తం 1000 మార్కులకు గాను 963 మార్కులు సాధించి అత్యుత్తమ ఫలితాన్ని నమోదు చేశారు.చిన్నప్పటి నుంచే చదువుపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, క్రమబద్ధమైన ప్రణాళికతో సిద్ధమవుతూ వచ్చిన శ్రీ చరణ్ తేజ్ తన కృషితో ఈ విజయాన్ని సాధించారు. ప్రతిరోజూ క్రమశిక్షణతో చదవడం, ఉపాధ్యాయులు సూచించిన విధంగా ముందుకు సాగడం తన విజయానికి ముఖ్య కారణమని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *