విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్
ఈ స్కూల్లో చదివిన వాళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ
1897 కాలం నాటి పాఠశాల నేడు ఎలా ఉన్నదంటే
ఒక్కప్పుడు 7 గ్రామాలకు ఇదే కీలకమైన పాఠశాల..
మా పిల్లలకు ఇక్కడే సౌకర్యం…అక్కడ సౌకర్యం లేదు..
Historic 1897 Government School: ఆంధ్రప్రదేశ్‌లో శతాబ్ధకాలం నుంచి విద్యార్ధులకు పాఠాలు, విద్యాబుద్దులు నేర్పిస్తున్న పాఠశాల షడన్‌గా మార్చే నిర్ణయం తీసుకున్నారు జిల్లా అధికారులు. దీంతో గ్రామానికి చెందిన విద్యార్ధుల తల్లిదండ్రులు షాక్ అయ్యారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలోని కడపనత్తం గ్రామంలో 1897 కాలం నాటి పాఠశాల అది. బ్రిటీష్ కాలం నాటి ఈ స్కూల్లో చదివిన ఆనాటి విద్యార్థులు ఉన్నత స్థానాలలో స్థిర పడ్డారు. జనార్దన్ గుప్తా, విజయలక్ష్మి, వేణుగోపాల్ రెడ్డి, మనోహర్ స్వామి, వెంకటాద్రి, మణి, రామచంద్ర ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇలా లెక్కలేవేయలేనంత మంది మంచి పొజిషన్లో ఉన్నారు. ఆ విధంగా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన పాఠశాల నేటికి నిర్మాణం, ఆప్పుడు వేసిన సిమెంట్ రేకులు, గోడ నిర్మాణం చూశారంటే షాక్‌కి గురవ్వాల్సిందే. అలాంటి నిర్మాణం నేటి నిర్మాణాలకు అద్దం పడుతున్నది. ఆ పాఠశాల గ్రామంలోని విద్యార్దుల తల్లిదండ్రులకు, భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటున్న విద్యార్థులకు ఒక్కసారిగా చెప్పుకోలేని కష్టం ఎదురైంది. అది ఏమంటే ఈ పాఠశాలకు చుట్టుపక్కల నుండి సుమారు 7 గ్రామాల నుండి వచ్చి విద్యార్థులు చదువుకొనే వారు. 1977లో ప్రాథమికొన్నత పాఠశాలగా గుర్తించారు. 1998లో ఉన్నత పాఠశాలగా అభివృద్ధి చెంది ఎందరో విద్యార్థులు ఉన్నత స్థానాలను కూడా అధిరోహించారు. వారిని చూసి, వారి నడవడిక, వారి ప్రవర్తన చూసి మా బిడ్డలు కూడా ఇలా తయారు కావాలి,మంచి స్థానాలు అధిరోహించాలని తల్లిదండ్రులు ఆశలు పెట్టుకొని మరీ పాఠశాలలు బాట పట్టి ,పిల్లలు ఎలా చదువుతున్నారు.
ఇక్కడ చదివిన స్టూడెంట్స్ గ్రాఫ్ ఎలా ఉందని అడిగి తెలుసుకొనే వారు.. కానీ విద్యార్థులు సంఖ్య హాజరు ఎక్కువగా ఉన్న సమయంలో టీచర్స్ లేక పిల్లలు పక్క పాఠశాలకు కొంత మంది, ప్రైవేటు పాఠశాలకు కొంత మంది వెళ్లిపోవడంతో కొద్దీ హాజరు శాతం తగ్గింది. దీన్ని గ్రహించిన ఉన్నతాధికారులు గౌనీతిమ్మేపల్లి పాఠశాలకు ఇక్కడ చదువుతున్న వారిని పంపాలని పిల్లకు సమాచారం ఇచ్చారు. కానీ పిల్లల తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఇక్కడే చదవాలి ,వేరే పాఠశాలకు పంపమని ఖరా ఖండిగా చెప్పేసారు. అవసరం అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రిని కలుస్తామని చెబుతున్నారు.
2026-2027 విద్యా సంవత్సరంకు సుమారు 35 మంది హాజరుకు సిద్ధంగా ఉన్నారని తల్లిదండ్రులు ముందుకొచ్చారు. ఇప్పుడే అడ్మిషన్లు చేసుకుంటాం అంటే 35 మంది సిద్ధంగా ఉన్నారని తల్లిదండ్రులు ముందుకొచ్చారు. దయ చేసి ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే అమర్నాధ్ రెడ్డి,మండల అధ్యక్షులు కిషోర్ గౌడు మా పాఠశాల పై చొరవ చూపాలని తల్లిదండ్రులుఅంబేత్కర్ జయంతి రోజు పాటశాల బాట పట్టి నిరసన వ్యక్తం చేశారు. కడపనత్తం గ్రామంలో 1897 సంవత్సరం కాలం నాటి ప్రభుత్వం పాఠశాల నేటికి కొనసాగుతున్నది. గత విద్యా సంవత్సరంలో ఒకటి నుండి 5 వరకు తరగతులు జరిగేవి.. కానీ సంవత్సరం మొదటలోనే 3,4,5 తరగతులను పక్క గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు మెర్జ్ చేశారు. ఆదిశలో కడపనత్తం పాటశాలలో 3,4,5 పూర్తిగా కాళీ అవ్వడం జరిగింది.కొంత మంది ప్రభుత్వ పాటశాల, మరికొంత మంది ప్రవేటు పాటశాల బాట పట్టారు.
ఈ విద్యా సంవత్సరంలో ఉన్న 1,2 తరగతులను కూడ పక్క పాటశాలకు వెళ్లాలని పిల్లలకి చెప్పడం, గ్రహించిన తల్లిదండ్రులు పాఠశాల ప్రాంగణం చేరుకొని సంబంధిత సిబ్బందిని నిలదీశారు. స్థానిక ఎం ఇ ఓ సుబ్రమణ్యం, గ్రామస్థులు, కమిటీ సభ్యులు చేరుకొని సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించే విధంగా మాట్లాడుకొన్నారు. సమస్య మండల విద్యా శాఖ పరిధి దాటడంతో గ్రామస్థులు స్థానిక మండల అధ్యక్షులు బి ఎం కిషోర్ గౌడు గృహం బాట పట్టి నెలకొన్న సమస్యను విన్నవించారు. సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో దామోదర్ నాయుడు, హిమామ్ షాబ్, వేణి, మురళీ స్వామి, శ్రీరాములు,రామచంద్ర గౌడు,ఈశ్వరమ్మ, నీలమ్మ, లక్ష్మి,అమ్మయ్య,పుణితమ్మ, కస్తూరీ,సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.


