Last Updated:
Forest Thief: పట్టణాలు పల్లెలు అయిపోయాయేమో మరి ఒక దొంగ చిత్రంగా ఆలోచించి అడవి దొంగగా మారాడు. ఏమీ లేకపోవడమేంటి ఏదో ఒకటి దొరుకుతుంది అనే ఆలోచనతో పగటిపూట తాళం వేసిన గిరిపుత్రుల నివాసాలను గుర్తించి రెక్కీ నిర్వహించి ఆ ఇళ్లలో చోరీ చేయడం ప్రారంభించాడు.
Forest Thief: మన ఇంట్లో ఏముంది పట్టుకుపోవడానికి అక్క? తాళం గూటిపై పెట్టాను మీ మరిది పిల్లలు వస్తే అన్నం పెట్టుకు తినమను, ఇలా వరుసలు కలుపుతూ గిరి పుత్రులు ఎంతో నమ్మకంతో అడవి ప్రాంతంలో జీవిస్తూ ఉంటారు. దాదాపుగా అక్కడ నివాసాల్లో ఉన్న ప్రజలంతా ఉదయం సమయంలో కూలి పని చేసుకునేందుకు వెళ్లి మధ్యాహ్నం లేదా సాయంత్రం తిరిగి వస్తుంటారు. పట్టణాలు పల్లెలు అయిపోయాయేమో మరి ఒక దొంగ చిత్రంగా ఆలోచించి అడవి దొంగగా మారాడు. ఏమీ లేకపోవడమేంటి ఏదో ఒకటి దొరుకుతుంది అనే ఆలోచనతో పగటిపూట తాళం వేసిన గిరిపుత్రుల నివాసాలను గుర్తించి రెక్కీ నిర్వహించి ఆ ఇళ్లలో చోరీ చేయడం ప్రారంభించాడు. ఇలా ఇప్పటి వరకు గిరిపుత్రులకు చెందిన రూ. 14 లక్షలు విలువైన బంగారు నగలు, వస్తువులను కాజేసాడు. మరి ఇలాంటి దొంగని పోలీసులు ఎలా గుర్తించారు..? అతని నుండి నిజాన్ని ఎలా కక్కించారు..? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పట్టుబడిన శివప్రసాద్ అనే వ్యక్తికి అడవి దొంగగా పోలీసులు ముద్రవేశారు. ఈ ఆసక్తికరమైన స్టోరీ చూడండి.
కాకినాడ జిల్లాకు సంబంధించి ఏలేశ్వరం ప్రాంతానికి చెందిన శివప్రసాద్ అనే వ్యక్తికి అడవి దొంగ అని ముద్రవేశారు పోలీసులు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిపుత్రులు, ఆదివాసీలు ఇళ్లలో దాచుకున్న నగలు, నగదుపై కన్నేశాడు. కూలీ నాలి పని చేసుకుంటూ వారి పిల్లల వివాహాల కోసం చిన్న చిన్న నగలు, వస్తువులను కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటున్నారు అడవి బిడ్డలు. ఇలాంటి ఇళ్లపై దుండగుడు కన్నేసాడు. కేవలం పగటిపూట దొంగతనాలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ముఖ్యంగా తాళం వేసిన ఇంట్లోకి చొరబడి బంగారం ఇంట్లో ఉన్న డబ్బు కాజేయడం ప్రారంభించాడు. ఇలా అనేక నివాసాల్లో బంగారం నగదు అపరించుకపోవడం అలవాటుగా మార్చుకున్నాడు.
తాజగా రంపచోడవరం డివిజన్లో ద్విచక్ర వాహనాలు తనిఖీ చేస్తూండగా ఈ ఏలేశ్వరం ప్రాంతానికి చెందిన శివప్రసాద్ తన వాహనంపై వెళ్తూ పోలీసులకు చిక్కాడు. వాహన రికార్డులు పరిశీలిస్తూనే అతను వద్ద అనుమానస్పద వ్యవహారం పోలీసులకు కనబడటంతో,కాస్త చెకింగ్ నిర్వహించారు. అప్పటికే దొంగతనం చేసి వస్తున్నాడు ఏమోగానీ అతని వద్ద పోలీసులకు కొంత బంగారం లభ్యమైంది.అనుమానంతో పోలీస్ స్టేషన్కు తరలించి విచారించగా ఆతగాడు చేసే వరస దొంగతనాలు బయటికి వచ్చాయి.నిజానికి పోలీసులే ఆశ్చర్యపోయే విధంగా 14 లక్షల విలువచేసే అనేక బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. ఇతగాడు ఏ విధంగా పగటిపూట దొంగతనాలు చేస్తాడు అన్నది పోలవరం ఏఎస్పీ స్వయంగా మీడియాకు వెల్లడించారు. పల్లెలైన, పట్టణాలైనా, గిరి పుత్రులు నివాసముండే నివాసాలైనా,తాళాలు వేసుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, తాళాలు బయటకు కనపడే విధంగా తాళాలు వేయకూడదంటూ పోలీసులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Kakinada,East Godavari,Andhra Pradesh
Apr 14, 2026 10:24 AM IST


