అంధత్వ నివారణ దేశంగా మనమందరం పాటు పడదాం..


రోటరీ క్లబ్ కోశాధికారి కే. నరేందర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; భారతదేశాన్ని అంధత్వ నివారణ దేశంగా చేసేందుకు మనమందరము పాటుపడుదాం అని రోటరీ క్లబ్ కోశాధికారి కె.రవీందర్ రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సీనియర్ డాక్టర్ సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ద్వారా నేత్రదానంపై ప్రజలకు కొన్ని సంవత్సరాలుగా అవగాహన కల్పిస్తున్నామని, ఈ అవగాహన వల్ల మరో ఇద్దరికి చూపు వస్తుందని తెలిపారు. 1994 నుండి నేత్ర సేకరణ రోటరీ క్లబ్ ద్వారా ప్రారంభించామని ఇప్పటివరకు నూటికి పైగా నేత్రదానం స్వీకరించడం జరిగిందని తెలిపారు. భారతదేశంలో నేత్రదానములో 25 శాతము మాత్రమే ఉన్నామని, అవగాహన లోపం ఉండడం వల్ల మనము తక్కువలో ఉన్నామని తెలిపారు. అదే శ్రీలంక దేశంలో ఎప్పటినుంచో ఆ దేశంలో ఎవరు చనిపోయిన వెంటనే నేత్రదానం చేసే అలవాటును అమలుపరచున్నారని తెలిపారు. ఇప్పటికీ భారతదేశానికి కళ్ళు కావాలి అంటే ఆ దేశం నుంచి దిగుమతి చేసుకొని మన భారతదేశంలోని కళ్ళు లేని వారికి ఎందరికో కంటి వెలుగును ప్రసాదిస్తున్నామని తెలిపారు. విదేశీ దేశం ద్వారా మనం కళ్లను తెప్పించుకోవడం ఒకరకంగా బాధాకరమని, భారతదేశంలోని ప్రతి పౌరుడు నేత్రదానంపై అవగాహన కలిగి ఉంటే, కోట్లల్లో ఉన్న జనాభా ప్రకారం నేత్రదానంలో మనము ప్రథమ స్థానంలో ఉంటామని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాబట్టే భారతదేశాన్ని అందత్వ నివారణ దేశంగా మలుచుకోవాలంటే యువతి యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు, స్వచ్ఛంద సేవ సంస్థలు, ప్రాథమిక స్థాయి నుండి కళాశాల స్థాయి వరకు అవగాహన తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు నేత్రదానం పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు స్పష్టం చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ నేత్రదానంపై పూర్తిగా అవగాహన కల్పించుకొని ఎక్కడైనా, ఎవరైనా మృతి చెందితే వెనివెంటనే సమాచారాన్ని అందజేసి వారి కళ్ళను నేత్రదానంగా స్వీకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. నేత్రదానంపై అపోహలు పెట్టుకోరాదని తెలిపారు. అన్ని దానాల కన్నా నేత్రదానం మిన్న అన్న స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ పాటించి అమలు చేయాలని తెలిపారు. నేత్రదానం చేసేవారు సెల్ నెంబర్ నరేందర్ రెడ్డి 9059990925 లేదా 9493361692 లేదా 9247159926 గాని సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం అందిన వెంటనే నేత్రదానం స్వీకరిస్తామని తెలిపారు. కావున నేత్రదానం కొరకు ప్రతి ఒక్కరూ సహకరించినప్పుడే అందత్వ నివారణ భారతదేశంగా మనమందరం వెలుగుతామని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *