Drama at Collectorate | “23 ఏళ్లుగా తిరుగుతున్నా.. ఇంకెన్నాళ్లు?” అధికారులపై కారం చల్లిన వృద్ధురాలు!



ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో లక్ష్మీతులసి అనే వృద్ధురాలు అధికారులపై కారం చల్లి నిరసన తెలపడం సంచలనం సృష్టించింది. నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన ఆమె భూమిని 2003లో రోడ్ల విస్తరణ కోసం ప్రభుత్వం తీసుకుంది. అయితే, గత 23 ఏళ్లుగా నష్టపరిహారం అందకపోవడంతో ఆమె కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. సోమవారం భూసేకరణ విభాగం అధికారులు ఆమెను పిలిపించి మాట్లాడారు. రికార్డులు పరిశీలించిన అధికారులు.. ఈ పరిహారం NHAI (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) చెల్లించాలని, తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. దశాబ్దాలుగా తిరుగుతున్నా మళ్లీ మరో అధికారి దగ్గరకు వెళ్లమని చెప్పడంతో ఆవేదన చెందిన వృద్ధురాలు, తన వెంట తెచ్చుకున్న కారం పొడిని సిబ్బందిపై చల్లింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *