Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా.. అయితే ఈ ఫోన్ నంబర్ సేవ్ చేసుకోండి, మీకే లాభం |


Last Updated:

Tirumala: తిరుమలలో భక్తులకు అందిస్తున్న లగేజీ డిపాజిట్ సేవల విషయంలో ఒక అనుచిత ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుమలలోని లగేజీ సెంటర్‌లో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వ్యక్తి కాసుల కోసం కక్కూర్తి పడ్డాడు.

తిరుమల లో లగేజీ కౌంటర్‌లో డబ్బులు వసూలు చేసిన ఉద్యోగి తొలగింపు..!
తిరుమల లో లగేజీ కౌంటర్‌లో డబ్బులు వసూలు చేసిన ఉద్యోగి తొలగింపు..!

Tirumala: తిరుమలలో భక్తులకు అందిస్తున్న లగేజీ డిపాజిట్ సేవల విషయంలో ఒక అనుచిత ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుమలలోని లగేజీ సెంటర్‌లో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న నరసింహారెడ్డి అనే వ్యక్తి, సేవలు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉన్నప్పటికీ, కొంతమంది భక్తుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు టీటీడీ అధికారుల దృష్టికి వచ్చింది. ఈ విషయం పై సమాచారం అందిన వెంటనే స్పందించిన టీటీడీ అధికారులు, సంఘటనను తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో, సంబంధిత ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకుంటూ అతన్ని తక్షణమే విధుల నుండి తొలగించారు. భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించే ఎవరిపైనా టీటీడీ రాజీ పడదని అధికారులు స్పష్టం చేశారు.

కొండపై గదుల పేరుతో మోసం..

తిరుమల కొండకు వచ్చే భక్తులు దేవుడిపై భక్తితో పాటు అక్కడి సిబ్బందిపై పూర్తి నమ్మకంతో దర్శనం చేసుకుంటారు. వేర్వేరు ప్రాంతాలు, రాష్ట్రాలు, ఇతర దేశాల నుండి కూడా నిత్యం వస్తుంటారు. అలాంటి పుణ్యక్షేత్రంలో భక్తులను దర్శనం టికెట్లు, గదులు, వసతి సౌకర్యం కల్పిస్తామని మోసం చేసే వాళ్లపై టీటీడీ నిఘా పెట్టింది. టీటీడీ భక్తులకు అందిస్తున్న ప్రతి సేవలో పారదర్శకత, నిబద్ధత, నాణ్యతను కాపాడడం తమ ప్రధాన లక్ష్యమని వెల్లడించింది. తిరుమలలో లగేజీ డిపాజిట్ సదుపాయం పూర్తిగా ఉచితమని, భక్తులు తమ సామాన్లను భద్రంగా ఉంచుకునేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని మరోసారి స్పష్టం చేసింది.అయితే కొంతమంది వ్యక్తులు భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అక్రమంగా డబ్బులు డిమాండ్ చేసే ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో, భక్తులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరింది.

ఈ నంబర్‌కి కంప్లైంట్ చేయవచ్చు..

అధికారికంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో మాత్రమే సేవలు పొందాలని, అనుమానాస్పద వ్యక్తుల మాటలను నమ్మవద్దని సూచించింది.ఇలాంటి అక్రమ వసూళ్లను పూర్తిగా నివారించేందుకు టీటీడీ విజిలెన్స్ విభాగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. తిరుమలలోని అన్ని లగేజీ కౌంటర్ల వద్ద పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు, సీసీటీవీ నిఘా వ్యవస్థను సిద్ధం చేస్తోంది. భక్తుల నుండి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వాటిని తక్షణమే స్వీకరించి, త్వరితగతిన చర్యలు తీసుకునే విధంగా వ్యవస్థను సిద్ధం చేసింది.ఈ నేపథ్యంలో, ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తే వెంటనే స్పందించి, టీటీడీ విజిలెన్స్ కంట్రోల్ నెంబర్ 9866898630కు సమాచారం అందించాలని భక్తులను కోరింది. భక్తుల సహకారం, అప్రమత్తతతో ఇటువంటి అక్రమాలను పూర్తిగా నిర్మూలించవచ్చని టీటీడీ వ్యక్తం చేసింది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *