Last Updated:
Heatwave Alert: ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న వారం రోజులు పాటు భారీ ఎండలు నమోదు అవుతున్నాయని తెలిపారు.
Heatwave Alert: ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న వారం రోజులు పాటు భారీ ఎండలు నమోదు అవుతున్నాయని తెలిపారు. భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ప్రజలందరూ కూడా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు అవసరమైతే తప్ప బయటకి రావద్దు అంటూ చెబుతున్నారు.
సోమవారం 51 మండలాల్లో తీవ్రవడగాలులు, 49 మండలాల్లో వడగాలులు, మంగళవారం 53 మండలాల్లో తీవ్రవడగాలులు, 57 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాల్పులు, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందన్నారు. ఎండ తీవ్రత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సోమవారం (13-04-26) శ్రీకాకుళం జిల్లాలో 9, విజయనగరం 18, పార్వతీపురంమన్యం 15, అల్లూరి 1, పోలవరం 3, అనకాపల్లి 3, ఏలూరు 2 మండలాల్లో *తీవ్రవడగాలులు(51) వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. అలాగే శ్రీకాకుళం 2, విజయనగరం 5,అల్లూరి 4, పోలవరం 9, అనకాపల్లి 5, కాకినాడ 5, తూర్పుగోదావరి 9, ఏలూరు 4, ఎన్టీఆర్ 3, పల్నాడు 2, నంద్యాల 1 మండలాల్లో వడగాలులు(49) ప్రభావం చూపనున్నట్లు తెలిపారు.
ఆదివారం కడప(జి) పొట్టిపాడులో 43.8°C, తిరుపతి(జి) వరదయ్యపాలెంలో 43.1°C, నంద్యాల(రూ) 42.9°C, అనంతపురం(జి) తెరన్నపల్లెలో 42.3°C, కర్నూలు(జి) గూడూరులో42.1°C, పల్నాడు(జి) దుర్గిలో 41.8°C, శ్రీసత్యసాయి(జి) బుక్కపట్నంలో 41.6°C, మార్కాపురం(జి) అనుమలపల్లి, నెల్లూరు(జి) కొమ్మిపాడులో 41.2°C, పశ్చిమగోదావరి(జి) పోడూరులో 41.1డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
ఎండలో బయటకు వెళ్లేప్పుడు తలకి టోపి పెట్టుకోవాలని, తెలుపురంగు గల కాటన్ వస్త్రాలను ధరించాలన్నారు.అదే విధంగా కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించాలన్నారు. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh



