విద్యార్థులకు అలర్ట్.. నేడు దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్ | తెలంగాణ వార్తలు


తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వచ్చేయడంతో.. ఇక డిగ్రీ కోర్సులపై ఫోకస్ పడింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ ప్రైవేట్ యూనివర్శిటీలకు అనుబంధంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నేడు డిగ్రీ అడ్మిషన్స్ ఆఫ్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ రానుంది. కాలేజీ విద్యా కమిషనర్ దేవసేన, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి కలిసి.. మండలి ఆఫీసులో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత 2 వారాలపాటు విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు వీలవుతుంది. ఆ తర్వాత ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఉంటుందని సమాచారం. మొత్తం 5 విడతల్లో డిగ్రీ ప్రవేశాల్ని పూర్తి చేస్తారు. ఇంకా సీట్లు మిగిలితే స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు.

ఇవాళ ఏమున్నాయి?

ఇరాన్ యుద్ధానికి 44 రోజులు పూర్తి అయ్యాయి. నేడు 45వ రోజు కొనసాగుతోంది. నేడు ప్రముఖ గాయని ఆశా భోస్లే అంత్యక్రియలు ముంబైలోని శివాజీ పార్కులో జరుగుతాయి. శ్రీకాకుళం నుంచి తిరుపతికి రైలు నేడు ప్రారంభమవుతుంది. తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు ఆపేందుకు నేటి నుంచి 6 రోజులు “ఎరైవ్ ఎలైవ్” కార్యక్రమం జరుగుతుంది. గోపీచంద్ 33వ సినిమా టైటిల్ గ్లింప్స్ నేడు ఉ.11.17కి రిలీజ్ అవుతుంది. IPLలో నేడు హైదరాబాద్ vs రాజస్థాన్ మ్యాచ్ రాత్రి 7.30కి ఉంటుంది. నేడు వరూధినీ ఏకాదశి. నేడు జలియన్ వాలాబాగ్ ఉచకోత దినం. ఇలాంటి మరిన్ని అప్‌డేట్స్ కింద ఉన్నాయి చూడండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *