Last Updated:
పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివృద్ధి పనులతో ప్రజాదరణ పెరిగింది, అమృత భారత పథకంలో రైల్వే స్టేషన్‌కు 37 కోట్లు, అభిమానులు పాలాభిషేకం చేశారు
ఒకప్పుడు ఆయన గెలిస్తే అక్కడ ఉంటారేంటి, భాగ్యనగరంలో ఉంటారు, ఆయన్ను గెలిపిస్తే మన పరిస్థితి ఏంటి అన్నవిధంగా ప్రతిపక్షాలు ఇంకొందరు జోరుగా ఆయన నియోజకవర్గంలో ప్రచారం చేశారు, కానీ ఇప్పుడు ఆయన ఇక్కడ పోటీ చేయడం, గెలవడం, మన పూర్వజన్మ సుకృతం అన్నవిధంగా అక్కడ ప్రజలు పట్టం కడుతున్నారు.
ఏకంగా రాష్ట్రం కాదు, దేశమంతా చూసే విధంగా ఆ నియోజకవర్గ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. సహజంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన, ఆయన కేంద్ర ప్రభుత్వంతో సైతం ఆ ఒక్క రైల్వే స్టేషన్ కి 37 కోట్లు మంజూరు చేయించారు, అంతే మహానుభావుడు మా దేవుడు అంటూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఇంతకీ ఆయనెవరు? ఆ నియోజకవర్గ ఎక్కడుంది? ఒకసారి వివరాలు చూద్దాం..
రాష్ట్రంలోనే పిఠాపురం నియోజకవర్గంలో ఒక గుర్తింపు నియోజకవర్గంగా ముందుకు వెళుతుంది. దీనికి ప్రధాన కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబే అంటూ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. ఎలక్షన్‌కు ముందు ఏమవుతుందో అని కాస్త భయం ప్రజల్లో ఉన్నా.. ఇప్పుడు ఆయన పోటీ చేయడమే మా అదృష్టం అన్న విధంగా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడలేని అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. హాస్పిటల్స్, పీహెచ్సీలు, అంతకుమించి వసతి గృహాలు, స్కూల్ బిల్డింగ్స్, సుదీర్ఘకాలంగా జరగని డ్యామ్ పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి పిఠాపురం రైల్వే స్టేషన్‌ను అమృత భారత స్టేషన్‌లోకి చేర్చి అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ కోరిన నేపథ్యంలో ఏకంగా రూ.37 కోట్లు నిధులు కేంద్రం విడుదల చేసింది.
దీనితో పిఠాపురం రైల్వే స్టేషన్ రూప్ రేఖలు పూర్తిగా మారిపోనున్నాయి, భారీ ఎంట్రన్స్, ఫుట్‌పాత్, డ్రింకింగ్ వాటర్, ఆధునికరంతో కూడిన టైల్స్, ఇలా ఒకటేంటి దాదాపుగా పవన్ పుణ్యమా అని రైల్వే స్టేషన్ పూర్తిగా మారిపోనుంది. దీంతో పిఠాపురం ప్రజలు, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. నిధులు కరెక్ట్ గా ఉపయోగించే నాయకుడు ఎవరైనా ఉంటే డిప్యూటీ సీఎం అది కేంద్రంకు ఎంతో నమ్మకం అంటూ ప్రత్యేకంగా ఎంపీ ప్రసంగించారు..
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Apr 09, 2026 12:13 PM IST


