Last Updated:
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ చందనోత్సవం 20న, రూ.300 రూ.1000 టికెట్లు 12 నుంచి 17 వరకు యూనియన్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ శాఖల్లో, అధికారిక వెబ్సైట్లో మాత్రమే లభ్యం
శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి చందనోత్సవం (నిజరూప దర్శనం) ఈనెల 20వ తేదీన అంగరంగ వైభవంగా జరుగనుంది. నిజరూప దర్శనం సంవత్సరానికి ఒక రోజు మాత్రమే ఈ దర్శనం ఉంటుంది. స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్రం మూలల నుంచి లక్షలాది భక్తులు విచ్చేస్తారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అని ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది. చందనోత్సవం నేపథ్యంలో భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం టికెట్లు విడుదల చేస్తుంది.
భక్తుల సౌకద్యార్థం రూ.300, రూ.1000 దర్శన టికెట్ల విక్రయానికి సంబంధించిన వివరాలను దేవస్థానం తెలియజేసింది. కొన్ని బ్యాంకులలో ఈ నెల 13వ తేదీ నుంచి 17వ తేదీ టికెట్లను వర్ణ విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఈ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్ణీత బ్యాంకు శాఖలలో ఈ టికెట్లు లభిస్తాయన్నారు. యూనియన్ బ్యాంక్ ఆప్ ఇండియా (సింహాచలం శాఖ, అక్కయ్యపాలెం శాఖల్లో) టికెట్లు విక్రయిస్తున్నట్టు తెలిపారు.
అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సింహాచలం శాఖ, బిర్లా జంక్షన్ శాఖల్లో టికెట్లు లభిస్తాయన్నారు. ఇక ఆన్లైన్ టికెట్లు కొనుగోలు చేయాలనుకునే భక్తులు ఈ నెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు దేవస్థానం అధికారిక వెబ్ సైట్ https://chandanotsavam.ap.gov.in లో రూ.300, రూ.1000 టికెట్లన్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి. కార్యాలయం వద్ద ఎలాంటి టికెట్లు విక్రయించడంలేదని స్పష్టం చేశారు. భక్తులు ఈ విషయం గమనించి, పైన పేర్కొన్న బ్యాంకు శాఖలలో, లేదా ఆన్లైన్లో మాత్రమే టికెట్లు పొందాలని ఆలయ ఈవో కోరారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



