భారత వాతావర శాఖ (IMD), ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించిన హీట్ వేవ్ హెచ్చరిక జారీచేసింది. ఏప్రిల్ 11 నుంచి 16 వరకూ కోస్తాంధ్ర, యానాంలో అత్యంత వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపింది. ఉక్కపోత కూడా ఉంటుంది. తెలంగాణకి హీట్ వేవ్ హెచ్చరిక చెయ్యలేదు. కానీ తెలంగాణలో కూడా ఇవాళ ఏప్రిల్ 11న వేడి వాతావరణమే ఉంటుంది. ఇంకా ఒడిశా, బెంగాల్, మాహారాష్ట్ర, కేరళ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకలో కూడా వేడి వాతావరణమే ఉంటుంది అని IMD చెప్పింది.



