Last Updated:
Free Electricity: నేతన్నల కోసం ఏపీ ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేస్తోంది. ఉచిత విద్యుత్ వాటిలో ఒకటి. ఐతే.. దీన్ని పొందాలంటే దరఖాస్తు చేసుకోవాలి. కాబట్టి.. ఇప్పుడు నేతన్నలు ఎంత బిజీగా ఉన్నా.. ఈ పని పూర్తి చేసుకోవాలి. ఏం చెయ్యాలో చూద్దాం.
ప్రభుత్వాలు పథకాలు ప్రవేశపెట్టినప్పుడు.. కొన్ని కండీషన్స్ కూడా పెడతాయి. ఆ అర్హతలు ఉన్నవారికే వాటిని ఇస్తూ ఉంటాయి. అలా ఏపీ ప్రభుత్వం ఇప్పుడు నేతన్నలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఐతే.. అందరికీ కాదు. అర్హులైన వారికే. దీనిపై రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత క్లారిటీ ఇచ్చారు. ఈ ఉచిత విద్యుత్ పథకాన్ని అర్హులైన వారంతా తప్పనిసరిగా పొందేలా చెయ్యాలని అధికారులను ఆదేశించారు.
ఇవాళ ఏప్రిల్ 10. ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 15. కాబట్టి.. నేతన్నలు వెంటనే అలర్ట్ అవ్వాలి. ఈ ఐదు రోజుల్లో వీలు చూసుకొని ఈ పని పూర్తి చేసుకోవాలి.
ఏపీ ప్రభుత్వం ఈ స్కీమ్‌ని ఏప్రిల్ 1న అమలు చేసింది. కానీ.. ఆ రోజు నుంచే ఉచిత విద్యుత్ అందరికీ ఇవ్వలేదు. అర్హులై, దరఖాస్తు చేసుకున్నవారికి ఇచ్చింది. ఈ స్కీమ్ కోసం ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా మగ్గంపై నేసే నేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు ఉచితంగా, అలాగే మర మగ్గంపై నేసే నేతన్నలకు నెలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తోంది. అందువల్ల మగ్గం నేతన్నలకు నెలకు రూ.720లు, మరమగ్గం నేతన్నలకు రూ.1,860లు ఆదా అవుతుందని వార్త రిపోర్ట్ చేసింది.
నిజంగా ఇదో గొప్ప పథకం. అసలు నేత కార్మికులు చాలా కష్టాల్లో, అప్పుల్లో ఉన్నారు. సరైన ఉపాధి అవకాశాలు వారికి లేవు. ప్రభుత్వ చర్యలు సరిపోవట్లేదు. వారి కెరీర్లో గ్రోత్ లేదు. అందువల్ల ఇలా ఉచిత విద్యుత్ ఇవ్వడం ద్వారా.. ఈ భారం వారికి తగ్గుతుంది. ఉదాహరణగా చెప్పాలంటే.. ఒంగోలులో ఓ నేతన్నకు నెలకు రూ.1500 కరెంటు బిల్లు వస్తుంటే.. ఇప్పుడు ఉచిత విద్యుత్ కారణంగా.. కరెంటు బిల్లు రూ.800 మాత్రమే పడవచ్చు. తద్వారా ఈ భారం తగ్గగలదు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



