Last Updated:
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూలగుమ్మి జలపాతంలో సెల్ఫీ దిగుతూ జారి పడిన నలుగురు బాలికల్లో ముగ్గురు మృతి, అంజలి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది
అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో ప్రమాదకర జలపాతాల వద్ద సెల్ఫీలు ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టం చేసింది. సరదాగా జలపాతాలు వద్ద గడిపేందుకు వెళ్ళిన నలుగురు బాలికలు అనంతగిరి మండలం మూలగుమ్మిలో సెల్ఫీ దిగుతూ జలపాతంలో పడిపోయారు. వేసవి కావడంతో సరదాగా ఈతకు వెళ్లి నలుగురిలో , ముగ్గురు బాలికలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో బాలిక అంజలి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక అనంతగిరి మండలం లుంగపర్తి ఆసుపత్రికి తరలించారు.
మృతులు త్రిష (17), రత్నకుమారి (16), పవిత్ర (16)ను హుకుంపేట మండలం జుంబువలస వాసులుగా స్థానికులు గుర్తించారు. జలపాతం వద్ద బాలికల అరుపులు వినిపించడం తో స్థానికులు వచ్చేసరికే ముగ్గురు బాలికలు ప్రాణాలు విడిచారు. మరొకరిని వెంటనే హాస్పటల్ కి తీసుకువెళ్ళి ప్రాణాలు కాపాడాడు. పరీక్షలు అంతరం వేసవి సెలవులు కావడంతో సరదాగా గడిపేందుకు రావడం జరిగిందని స్థానికులు అంటున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఆడపిల్లలు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఇటీవలే వీరంతా ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. వేసవి కావడంతో సరదాగా ఈత కోసం వెళ్లి ఇటువంటి ప్రమాదంలో చిక్కుకున్నారు. వాటర్‌ఫాల్స్ ప్రాంతాల్లో రాళ్లు జారుడుగా ఉండటం, భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో జలపాతాల వద్దకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలకు జాగ్రత్తలు చెప్పాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Apr 10, 2026 11:40 AM IST


