Thunderstorm Warning: ఏపీలో ఈ జిల్లాలో ఎండలు , ఏ జిల్లాలకు వర్షాల హెచ్చరిక | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

Thunderstorm Warning: ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు , మరోపక్క ఎండలు కూడా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. శుక్రవారం (10-04-26) ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాల్పులు, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉంది.

ఏపీలో ఏ ఏ జిల్లాల ఎండలు , ఏ జిల్లాలకు వర్షాలు వాతావరణ అప్డేట్
ఏపీలో ఏ ఏ జిల్లాల ఎండలు , ఏ జిల్లాలకు వర్షాలు వాతావరణ అప్డేట్

Thunderstorm Warning: ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు , మరోపక్క ఎండలు కూడా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. శుక్రవారం (10-04-26) ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాల్పులు, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మరోవైపు  తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడు మీదుగా మన్నార్ వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపధ్యంలో ఎండతీవ్రత, పిడుగులతో కూడిన అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఉత్తరాంధ్రలో వడగాల్పులు..

విజయనగరం జిల్లా బాడంగి, బొబ్బిలి, తెర్లాం, వంగర మండలాలు, పార్వతీపురంమన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి, జియ్యమ్మవలస,  పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం మండలాలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో(16) తీవ్రవడగాలులు వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. అలాగే విజయనగరం 7, మన్యం 6,  పోలవరం 2, ఏలూరు 2, ఎన్టీఆర్ 2 మండలాల్లో వడగాలులు(19) ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. శనివారం మొత్తంగా 54 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉన్న మండలాల పూర్తి వివరాలు లింక్లో : https://apsdma.ap.gov.in/files/c66001afea1244d124bee3dfce009740.pdf ఉందని తెలిపారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వడగాలుల వీస్తున్నందున మహిళలు, పిల్లలు, వృద్దులు సరైన జాగ్రత్తలు  తీసుకోవాలని కోరారు. ప్రజలు డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS, ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉదయం ఎండలు సాయంత్రం వర్షాలు పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇటువంటి అకాల వర్షాలు వచ్చినప్పుడు రైతులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఒక్కో సమయంలో అధికంగా పిడుగులు పడే అవకాశం ఉందని పిడుగులు పడే సమయంలో నేలపై పడుకోవాలని తెలుపుతున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *