ఇక ఈ ట్రైన్ టైమింగ్స్ చూస్తే రైలు నెంబర్ 17440 శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతి వరకు ఏప్రిల్ 13 నుంచి ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం రోడ్‌లో బయల్దేరుతుంది. ఈ రైలు చీపురుపల్లెకు 15:25, విజయనగరానికి 15:55, కొత్తవలసకు 16:30, పెందుర్తికి 16:40, దువ్వాడకు 17:58, అనకాపల్లికి 18:18, ఎలమంచిలికి 18:33, సామర్లకోటకు 20:08, రాజమండ్రికి 21:08, ఏలూరుకు 22:18, విజయవాడకు 00:20, తెనాలికి 01:08, బాపట్లకు 01:53, చీరాలకు 02:13, ఒంగోలుకు 03:03, నెల్లూరుకు 04:28, గూడూరుకు 05:33, రేణిగుంటకు, చివరగా తిరుపతికి ఉదయం 08:10 గంటలకు చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)



