Pawan Kalyan: AU శతాబ్ది వేడుకల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా పవన్ కల్యాణ్.. డిప్యూటీ సీఎం అంటే ఇంత ఇష్టమా..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

AU Centenary Celebrations: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్ధులను ఉద్దేశించి ఏం చెప్పారో తెలుసా..?

Pawan Kalyan
Pawan Kalyan

AU Centenary Celebrations: యువత ఏ ఒక్క భావజాలాన్ని గుడ్డిగా నమ్మవద్దు. ఎవరి ఐడియాలజీని గుడ్డిగా నమ్మి ప్రభావితం కావద్దు. మీరు ప్రభావితం అయిన భావజాలం ఈ కాలానికి సరిపోతుందా? లేదా అనేది ఒకటికి పదిసార్లు ఆలోచించి ముందుకు వెళ్లండి. భావోద్వేగాలతో కాకుండా వాస్తవికత ఆధారంగా ఆలోచనలు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని మార్చగల శక్తివంతమైన ఆయుధం విద్య అని, సమాజ సేవే యువత ధ్యేయం కావాలని కోరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  నాయకత్వంలో దేశం ప్రపంచ శక్తిగా నిలిస్తే, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. తన ఆఖరిశ్వాస వరకు భవిష్యత్ తరాల కోసమే పని చేస్తానని తెలిపారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్ధులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్  ప్రసంగిస్తూ “ఆంధ్ర విశ్వకళాపరిషత్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. యూనివర్శిటీ గురించి మాట్లాడుకోవాలంటే మొదట చిహ్నం గురించి మాట్లాడుకోవాలి. ఆంధ్ర యూనివర్సిటీ లోగోను ప్రత్యేక శ్రద్ధతో తయారుచేశారు. ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని కళల అభివృద్ధికి నెలకొల్పిన సంస్థ అనే అర్థంతో ‘ఆంధ్ర విశ్వకళాపరిషత్‌’ అని దీనికి నామకరణం చేశారు. లోగోలోని దిగువభాగంలో ఉన్న రెండు సర్పాలు జ్ఞానాన్ని కోరుకునేవారిని, జ్ఞాన సంరక్షకులను సూచిస్తాయి.

ఆంధ్ర విశ్వ విద్యాలయం శతాబ్దకాలం ఎంతో మంది చరిత్రలో నిలిచారు. ఇదే విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసిన మాజీ ఉపరాష్ట్రపతి ఉన్నారు. మనం జీవితంలో ఎటువైపు వెళ్లాలి అనే మార్గాన్ని ఎంచుకునే ఆలోచన మనకి యూనివర్శిటీతో మొదలవుతుంది. ఆ గమ్యాన్ని ఎలా చేరుకోవాలనేది మాత్రం స్వశక్తితోనే నిర్ణయించుకోవాలి. మీరు కేవలం విశ్వ విద్యాలయం విద్యార్ధులు మాత్రమే కాదు.. ఈ విశ్వ విద్యాలయం భవిష్యత్తు మీరు. ఇక్కడ గడిపే రోజులు మీ జీవితంలో ముఖ్యమైన క్షణాలు. మీ ఆలోచనలు తీర్చిదిద్దే అద్భుత క్షణాలు. దేశ భవిష్యత్తుకు మీరే నావికులు. విద్య అంటే పుస్తకాల్లో ఉన్న జ్ఞానం మాత్రమే కాదు. సమస్యల్ని ఎదుర్కోగలిగే ధైర్యం. సరైన నిర్ణయాలు తీసుకునే వివేకం. సమాజానికి ఉపయోగపడే బాధ్యత. సౌతాఫ్రికా అధ్యక్షునిగా చేసిన శ్రీ నెల్సన్ మండేలా గారి మాటల్లో చెప్పాలంటే ప్రపంచాన్ని మార్చగలిగే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య. మీ లక్ష్యం కేవలం ప్రతిభ కాదు. మీ ధ్యేయం సమాజ సేవ కూడా కావాలి. మీ జ్ఞానం మీ కోసమే కాకుండా, సమాజానికి, దేశానికి ఉపయోగపడాలి అన్నారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో విద్యార్ధులు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫోటోతో కూడిన ఎల్.ఈ.డి. స్క్రీన్లను ప్రదర్శించారు. భారీ సైజులో ఉన్న ఫ్లెక్సీ ఫోటోలను ఎగురవేసి తమ ఆనందాన్ని, అభిమానాన్ని చాటుకున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *