నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 10న మెగా జాబ్ మేళా.. టాప్ కంపెనీలతో భారీ నియామకాలు..! |


Last Updated:

ఏప్రిల్ 10న అన్నమయ్య జిల్లాలోని కలికిరి శ్రీనివాస జూనియర్ డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళా, 10కు పైగా కంపెనీలు, 500కు పైగా ఉద్యోగాలు, 10వ తరగతి నుంచి బీటెక్ వరకు అర్హులు

News18
News18

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లాలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి దాసరి నాగార్జున తెలిపారు. ఏప్రిల్ 10, 2026న కలికిరిలోని శ్రీనివాస జూనియర్ డిగ్రీ కాలేజ్‌లో ఈ భారీ జాబ్ మేళా జరగనుండటం విశేషం. ఒకే వేదికపై ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉండటంతో యువతలో ఆసక్తి నెలకొంది.

ఈ మెగా జాబ్ మేళాలో 10కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొనగా, సుమారు 500కు పైగా ఉద్యోగ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. Cholamandalam Finance, PhonePe, TATA AIA Life Insurance, Muthoot Finance, Shaadi.com వంటి పలు ప్రముఖ సంస్థలు యువతను నియమించుకునేందుకు ముందుకు వచ్చాయి. దీంతో వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

ఈ జాబ్ మేళాలో పాల్గొనాలనుకునే అభ్యర్థులకు విద్యార్హతల పరంగా మంచి అవకాశం ఉంది. పదో తరగతి నుంచి బీటెక్ వరకు చదివిన వారు.. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎలక్ట్రికల్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ వంటి కోర్సులు పూర్తి చేసినవారు అర్హులు. వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. తమ అర్హతల ఆధారంగా వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది.

ఎంపికైన అభ్యర్థులు విజయవాడ, కృష్ణ, గుంటూరు, హైదరాబాద్, వైజాగ్ వంటి నగరాల్లో ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది. యువత తమ ప్రతిభ, నైపుణ్యాన్ని చూపిస్తే తక్షణమే ఎంపికయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. గతంలో నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా ఇప్పటికే అనేకమంది యువత ఉద్యోగాలు పొందారని పేర్కొన్నారు.

ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అలాగే స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 10న ఉదయం 10 గంటలకు తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపారు. ఏవైనా సందేహాల కోసం 6301612761, 9177143181, 7799587687, 8897776368 నంబర్లను సంప్రదించవచ్చు.

నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వదులుకోకుండా తప్పక ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చదువు పూర్తయ్యాక ఖాళీగా ఉండకుండా, తమ నైపుణ్యానికి సరిపోయే ఉద్యోగాన్ని పొందేందుకు ఈ మెగా జాబ్ మేళా ఒక గొప్ప వేదికగా మారనుంది. ఒకరోజే జరిగే ఈ అవకాశాన్ని మిస్ అయితే మళ్లీ ఎప్పుడు వస్తుందో తెలియదు.. కాబట్టి యువత వెంటనే సిద్ధమవ్వాలి.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *