College Students Fight: ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో ఫైట్.. తాగి తన్నుకున్న స్టూడెంట్స్ |


Last Updated:

Viral Video: నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ పరిధిలోని ఆది శంకర ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు ఉద్రిక్తంగా మారాయి. మంగ్లీ సాంగ్‌తో ఉత్సాహంగా ప్రారంభమైన ఈవెంట్ క్రమంగా అదుపు తప్పి స్టూడెంట్స్ కొట్టుకునే వరకు వెళ్లింది.

+

Viral

Viral Video

Viral Video: ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరు జిల్లాలో ఓ ఇంజనీరింగ్ కాలేజీ వార్షికోత్సవ వేడుకల్లో స్టూడెంట్స్ గొడవపడటంతో రచ్చ రచ్చగా మారింది. నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ పరిధిలోని ఆది శంకర ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు ఉద్రిక్తంగా మారాయి. మంగ్లీ కచేరీతో ఉత్సాహంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం క్రమంగా అదుపు తప్పి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. మద్యం మత్తులో ఉన్న కొంతమంది విద్యార్థులు పరస్పరం వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి హఠాత్తుగా ఉద్రిక్తమైంది. ఆ తర్వాత ఘర్షణ తీవ్రరూపం దాల్చి, విద్యార్థులు కత్తులు, కర్రలు, కుర్చీలు వంటి వస్తువులతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. పరిస్థితి నియంత్రణలోకి తీసుకురావడానికి పోలీసులు అప్రమత్తమై వెంటనే రంగంలోకి దిగి అల్లర్లను అదుపులోకి తీసుకువచ్చారు.

కాలేజ్ ఫెస్ట్‌లో గలాటా..

ఇంజనీరింగ్ కాలేజీల్లో స్టూడెంట్స్ మధ్య తగాదాలు, గ్రూప్ వార్స్ కామన్‌గా జరుగుతూనే ఉంటాయి. అయితే ఇవి కాలేజీ ఫ్రెషర్స్ పార్టీ లేదంటే యాన్సువల్ డే సెలబ్రేషన్స్‌లో బయటపడతాయి. తాజాగా నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ పరిధిలోని ఆది శంకర ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్ మద్యం మత్తులో గొడవపడటం, కుర్చీలు, కర్రలతో దాడి చేసుకోవడంతో కాలేజీలో భద్రతా పరిస్థితులపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. క్యాంపస్‌లోనే మద్యం సేవిస్తున్నారన్న ఆరోపణలు స్థానికులను కలవరపెడుతున్నాయి. ఇదే కాలేజీలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం గమనార్హం.

కొట్టుకున్న స్టూడెంట్స్..

తరచూ వివాదాలు చోటుచేసుకోవడం వల్ల విద్యార్థుల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విద్యా సంస్థగా ఉండాల్సిన ప్రదేశం అల్లర్లు , అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతుందా అన్న ప్రశ్నలు స్థానికుల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యా బోధన కంటే క్రమశిక్షణ లోపం ఎక్కువగా కనిపిస్తోందని వారు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సంఘటనలు విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని వారు హెచ్చరిస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని, కాలేజీలో క్రమశిక్షణను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *