Last Updated:
Indian Railway: దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్ల ఆధునీకరణ రెండో దశ పనులను కేంద్ర ప్రభుత్వం చకచక చేపడుతోంది. అమృత్ భారత్ పేరుతో రైల్వేస్టేషన్లు అద్దాల మేడల్లా మెరిసిపోతున్నాయి.
Indian Railway: దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్ల ఆధునీకరణ రెండో దశ పనులను కేంద్ర ప్రభుత్వం చకచక చేపడుతోంది. అమృత్ భారత్ పేరుతో రైల్వేస్టేషన్లు అద్దాల మేడల్లా మెరిసిపోతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పలు రైల్వే స్టేషన్లలో రెండవ దశ పనులు చూస్తుంటే అసలు మనం రైల్వే స్టేషన్లో ఉన్నామా, లేక ఎయిర్పోర్టులో ఉన్నామా అనే సందేహం కలుగుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రైల్వేస్టేషన్లు ఇప్పుడు అలాగే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీకి సంబంధించి కొన్నిజిల్లాలో అద్భుతంగా రైల్వే స్టేషన్ లో కనిపిస్తున్నాయి. ఇక ఫేజ్ టూ పనులు సైతం ప్రారంభిస్తున్నామంటూ రైల్వేశాఖ మీడియా ముఖంగా పేర్కొంది. ఫేజ్ వన్ పేరుతో ఎలాంటి రైల్వేస్టేషన్లలో అభివృద్ధి జరిగాయి..? రెండో దశలో ఎలాంటి రైల్వేస్టేషన్లు అభివృద్ధి జరుగుతున్నాయో ఓసారి వివరంగా ఈ వీడియో స్టోరీలో తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రశాంతతకే కాదు అభివృద్దికి అహ్లాదకరమైన వాతావరణానికి చాలా ఫేమస్. మరీ ముఖ్యంగా కాకినాడ జిల్లాలోని సామర్లకోట, తుని లాంటి రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ మొదటి విడతలో అద్భుతంగా అభివృద్ధి చెందాయి. దీనిలో భాగంగా రైల్వేస్టేషన్లో ప్రారంభం నుంచి దాదాపు అన్ని భాగాలు నూతన హంగులతో కలకలాడుతూ కనిపిస్తున్నాయి. తుని రైల్వే స్టేషన్ కు సంబంధించి 20 కోట్లతో మొదటి దశ పనులు పూర్తి చేసినట్లుగా రైల్వే అధికారులు అధికారికంగా మీడియాకు తెలియజేశారు. రైల్వే స్టేషన్ ప్రాంగణం దాదాపుగా గ్రీనరీ ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
అదే విధంగా టికెట్ కౌంటర్ మొదలుకొని వెయిటింగ్ హాల్, వాష్రూమ్స్, డ్రింకింగ్ వాటర్, పుట్ పాత్ ఇలా అన్ని అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగిందని పేర్కొన్నారు. ఒక్క మాటగా చెప్పాలి అంటే రైల్వే స్టేషన్ కాదు ఎయిర్ పోర్ట్ లుక్ వచ్చే విధంగా రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసినట్లుగా రైల్వే అధికారులు స్పష్టం చేశారు. తుని రైల్వే స్టేషన్ తో పాటు సామర్లకోట కాకినాడ రైల్వే స్టేషన్ లో సైతం ఇదేవిధంగా అభివృద్ధి చేస్తున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం రైల్వే స్టేషన్ సైతం అమృత్ భారత్ పేరుతో రైల్వే యంత్రాంగం అభివృద్ధి ప్రారంభించింది. దాదాపు ఆరు మాసాల్లో పిఠాపురం రైల్వే స్టేషన్ రూపు రేఖలన్నీ మారిపోననుట్లుగా సమాచారం అందుతుంది. గోదావరి జిల్లాలకు సంబంధించి తుని, సామర్లకోట, రాజమండ్రి స్టేషన్లు అతి పెద్దవిగా చెప్పుకోవచ్చు. తర్వాత పిఠాపురం రైల్వే స్టేషన్ ఈ మూడు రైల్వే స్టేషన్ కు తగ్గట్టుగా తయారు చేస్తున్నారు. ఏది ఏమైనా గోదావరి జిల్లాలో ఉన్న రైల్వే స్టేషన్లు అమృత భారత్ పేరుతో అద్భుతంగా అభివృద్ది చేసే ఆలోచన రావడాన్ని పలువురు పేర్కొంటున్నారు. రైల్వేస్టేషన్లో కాదు ఇవి అద్భుతమైన ఎయిర్పోర్ట్లు అన్న విధంగా ఆకట్టుకుంటున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక పర్యాటక ప్రాంతం ఎంట్రీ లుక్, మహానుభావుల విగ్రహాలు లైటింగ్లు మనతుని, మన సామర్లకోట వంటి బోర్డులు సైతం ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Kakinada,East Godavari,Andhra Pradesh
Apr 08, 2026 11:01 AM IST


