Last Updated:
Chandrababu Naidu: రాయలసీమను పండ్ల తోటల కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు సాగునీటి భద్రత ద్వారా ప్రతి ఎకరాన్ని సస్యశ్యామలం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
Chandrababu Naidu Jaladhara: అనంతపురం జిల్లా యాడికిలో జరిగిన ‘జలధార’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి నీటి సంరక్షణ చర్యలు, కాల్వల విస్తరణ పనుల గురించి సీఎంకు వివరించారు. ముఖ్యమంత్రి 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఫొటో ఎగ్జిబిషన్తో పాటు డ్వాక్రా మహిళల స్టాళ్లను సందర్శించారు. ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణి, పల్లె సింధూర రెడ్డి స్థానిక ఉత్పత్తులను సీఎంకు చూపగా, ప్రకృతి సేద్యం, వ్యర్థాల నిర్వహణపై అస్మిత్ రెడ్డి వివరాలు అందించారు.అనంతరం గ్రానైట్, సున్నపురాయి గనుల స్టాళ్లను, టూరిజం స్టాల్ను సందర్శించిన సీఎంకు.. జిల్లాలో పర్యాటకుల తాకిడి పెరిగిందని జేసీ ప్రభాకర్ రెడ్డి వివరించారు. దీనికి అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
రాయలసీమను పండ్ల తోటల కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు, సాగునీటి భద్రతద్వారా ప్రతి ఎకరాన్ని సస్యశ్యామలం చేయాలనిలక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం అనంతపురం జిల్లాలోజరిగిన ‘సాగునీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, నీటి సంరక్షణ ప్రాముఖ్యతపై దృష్టి సారించారు. ప్రతినీటి బొట్టుకు విలువనిచ్చి, భూమినే ఒక పెద్ద జలాశయంగా మార్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గతంలో అమలు చేసిన ఇంకుడు గుంతలు, పంటకుంటలు, ‘నీరు-మీరు’,’నీరు-ప్రగతి’ వంటి పథకాలు భూగర్భ జలాల పెంపులో కీలక పాత్ర పోషించాయనిగుర్తుచేశారు. రాయలసీమలో ఇప్పటికే 20 వేలచెరువులు నింపగా, అనంతపురం జిల్లాలోభూగర్భ జల మట్టాన్ని 11.25 మీటర్లకుపెంచినట్లు వెల్లడించారు.
శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు నిత్యం నీళ్లు ప్రవహించేలా చేయడమే నా జీవిత లక్ష్యం అని ఈ సభలో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు.ఈ సభలో వేలాదిగా చంద్రబాబు నాయుడు గారి అభిమానులు స్థానిక ప్రజలు కార్యకర్తలుఈ సభకు ఎండకు లెక్క చేయకుండా ఉన్నారు అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజా ప్రతినిధులు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Anantapur,Anantapur,Andhra Pradesh


