Tirupati: మృత్యుమార్గంగా మారిన పలమనేరు బైపాస్.. ఆ దారిలో వెళ్లాలంటే ప్రయాణికుల్లో వణుకు | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

Tirupati: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ప్రజల్ని భయపెడుతున్నాయి. పలమనేరు టూ చిత్తూరుకు వెళ్లే  బైపాస్‌లో వరుస ప్రమాదాలు  తీవ్ర కలకలం రేపుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే రెండు దుర్ఘటనలతో జనం హడల్.

+

పలమనేరు

పలమనేరు బైపాస్ అంటే ప్రయాణికుల్లో గుబుల్అర్ధరాత్రివద్ద ఘోర రోడ్డు ప్రమాదం…తిరు

Tirupati: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ప్రజల్ని భయపెడుతున్నాయి. పలమనేరు టూ చిత్తూరుకు వెళ్లే  బైపాస్‌లో వరుస ప్రమాదాలు  తీవ్ర కలకలం రేపుతున్నాయి. వారం రోజులకు ముందు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన సంఘటన మర్చిపోక ముందే మరో ప్రమాదం ఆదివారం అర్ధరాత్రి  జరిగింది. ఈదుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులను బైపాస్ పొట్టన పెట్టుంది. ప్రయాణికుల్లో ఆ బైపాస్ అంటే గుబులు పుట్టిస్తున్నది. పోలీస్ సిబ్బంది ఆ బైపాస్ లో కట్టు దిట్టమైన  ఏర్పాట్లు చేసిన మరణాల శాతం  పెరుగుతుందే తప్ప తగ్గడం లేదని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు.

తిరుపతి కోర్టు సిబ్బంది ఇద్దరు మృతి..

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం బైపాస్‌ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో తిరుపతి కోర్టులో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. ప్రైవేటు కార్యక్రమం నిమిత్తం బెంగళూరు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.​పోలీసుల కథనం ప్రకారం తిరుపతి కోర్టులో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న యుగంధర్, ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న హరీష్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో బెంగళూరు వెళ్లారు. ఆదివారం తిరుగు ప్రయాణంలో గంగవరం బైపాస్ వైయస్సార్ విగ్రహం సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది.

అర్ధరాత్రి యాక్సిడెంట్..

యాక్సిడెంట్ జరిగిన సమయంలో కారు ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ ఎలాంటి ముందస్తు సిగ్నల్ ఇవ్వకుండా ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడం వల్ల ​వేగంగా వస్తున్న కారు లారీని తప్పించబోయే క్రమంలో ఎడమ భాగం లారీ కుడి వైపు వెనుక భాగానికి బలంగా తగిలింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జవ్వగా ముందు సీట్లో ఉన్న యుగంధర్, హరీష్ అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మిగిలిన ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ​ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోర్టు సిబ్బంది మృతితో తిరుపతి న్యాయశాఖ వర్గాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *