Free Basketball Coaching: అక్కడ ఫ్రీగా బాస్కెట్ బాల్ కోచింగ్.. నేషనల్ ఛాంపియన్‌షిప్‌ చేయడమే లక్ష్యం | క్రీడా వార్తలు


Last Updated:

Free Basketball Coaching: శ్రీకాకుళం పట్టణంలో క్రీడా రంగానికి విశేషమైన సేవ అందిస్తున్న వ్యక్తుల్లో జి. అర్జున్ రెడ్డి ఒకరు. గత 20 సంవత్సరాలుగా ఆయన చిన్నారులకు ఉచితంగా బాస్కెట్‌బాల్ కోచింగ్ అందిస్తూ అనేక కుటుంబాల ఆశలను నెరవేర్చుతున్నారు.

+

Free

Free Basketball Coaching

Free Basketball Coaching: శ్రీకాకుళం పట్టణంలో క్రీడా రంగానికి విశేషమైన సేవ అందిస్తున్న వ్యక్తుల్లో జి. అర్జున్ రెడ్డి ఒకరు. గత 20 సంవత్సరాలుగా ఆయన చిన్నారులకు ఉచితంగా బాస్కెట్‌బాల్ కోచింగ్ అందిస్తూ అనేక కుటుంబాల ఆశలను నెరవేర్చుతున్నారు. క్రీడలంటే ఆసక్తి ఉన్నా, ఆర్థిక పరమైన పరిమితుల వల్ల అవకాశాలు కోల్పోతున్న పిల్లలకు ఆయన ఒక ఆశాకిరణంగా నిలిచారు.

జి. అర్జున్ రెడ్డి ఉచితంగా 10 సంవత్సరాలు బాస్కెట్ బాల్ కోచింగ్ ఇవ్వడం వలన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారు సెలక్ట్ చేసి తీసుకోవడం జరిగింది. ప్రతి రోజు ఉదయం,సాయంత్రం శ్రీకాకుళం మున్సిపల్ గ్రౌండ్‌లో పిల్లలకు క్రమపద్ధతిలో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణలో బాస్కెట్‌బాల్ ప్రాథమిక నైపుణ్యాల నుంచి ప్రారంభించి, ప్రొఫెషనల్ స్థాయి టెక్నిక్స్ వరకు నేర్పుతున్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగడంలో ఎం.ఎస్.ఆర్ కృష్ణమూర్తి పాత్ర ఎంతో కీలకం. పిల్లలకు అవసరమైన బంతులు, షూస్, యూనిఫామ్‌లు ఇతర క్రీడా సామగ్రిని ఆయన ఆర్థికంగా సమకూరుస్తున్నారు. ఈ సహకారం వల్లే ఎటువంటి ఫీజులు లేకుండా, అందరికీ అందుబాటులో ఈ కోచింగ్ కొనసాగుతోంది. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది.

జి.అర్జున్ రెడ్డి అనే ఈయన శ్రీకాకుళం తరుపు నుంచి నేషనల్ బాస్కెట్బాల్ ఆడ్ ఇన్ వ్యక్తుల్లో ఈయన ఒకడు అప్పట్లో ఈయనకు సిల్వర్ మెడల్ వరకు రావడం జరిగింది. కాని శ్రీకాకుళంలో బాస్కెట్బాల్ కి కోచింగ్ ఎవరు ఇవ్వట్లేదు. పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది కాని కోచింగ్ లేకపోవడం దానికి ఫీజుండడం వల్ల ఎవరు జాయిన్ అవలేకపోతున్నారనేది దృష్టిలో ఉంచుకొని ఆయన ఉచితంగా ఆయన సొంత డబ్బులతో 20 సంవత్సరాలుగా ఉచితంగా నేర్పించడం జరిగింది.

ఈయన ఉచితంగా సెక్షన్ ఇవ్వడానికి గుర్తించిన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్లు ఆయనకు కొంత స్థాయి పండిస్తూ పిల్లలకు బాలు ఇతర అవసరాలను గేమ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అటువంటి ఇన్ఫర్మేషన్ ఈయనకిస్తూ ఉంటారు ఇక్కడ నుంచి సుమారుగా చాలామంది నేషనల్ ఆడడం జరిగింది స్పోర్ట్స్ కోటాలో చాలామందికి ఉద్యోగాలు రావడం కూడా జరిగింది. ఈయన ఒక ప్రైవేట్ కంపెనీలో చేస్తూ ఉండేవారు ప్రస్తుతం dso లో coach గా పనిచేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయ్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈయన వయస్సు 65 సంవత్సరాలు.

ఈ 20 సంవత్సరాల ప్రయాణంలో అర్జున్ రెడ్డి శిక్షణ పొందిన అనేక మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మంచి ప్రతిభ కనబరిచారు. కొందరు నేషనల్ ఛాంపియన్‌షిప్‌లకు ఎంపికై తమ ప్రతిభను దేశవ్యాప్తంగా చాటారు. ఇది శ్రీకాకుళం పట్టణానికి గర్వకారణంగా నిలిచింది.కేవలం క్రీడా నైపుణ్యాలే కాకుండా, అర్జున్ రెడ్డి పిల్లల్లో క్రమశిక్షణ, సమయపాలన, జట్టు భావన వంటి విలువలను కూడా పెంపొందిస్తున్నారు. ఈ లక్షణాలు వారి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతూ, భవిష్యత్‌లో మంచి పౌరులుగా ఎదగడానికి సహాయపడుతున్నాయి. ఆయన శిక్షణ పొందిన కొంతమంది విద్యార్థులు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించడం కూడా ఆయన కృషికి నిదర్శనం.

ఈ కార్యక్రమం ద్వారా అనేక కుటుంబాల్లో ఆనందం నింపబడింది. పిల్లలు క్రీడల్లో ముందుకు సాగడమే కాకుండా, ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుగుతున్నారు. సమాజంలో ఇలాంటి సేవా భావం కలిగిన వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు. అర్జున్ రెడ్డి గారు మరియు ఎం.ఎస్.ఆర్ కృష్ణమూర్తి సేవలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ ఉచిత బాస్కెట్‌బాల్ కోచింగ్ కార్యక్రమం శ్రీకాకుళం పట్టణంలో క్రీడా సంస్కృతిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భవిష్యత్‌లో మరింత మంది యువ క్రీడాకారులు ఇక్కడి నుంచి వెలుగులోకి రావాలని ఆశిద్దాం.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *