Heavy Rains Alert: రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు.. 3 రోజుల పాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, వడగళ్లు | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనము , తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించిన ద్రోణి ప్రభావంతో  రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు పడతాయి అని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

ఏపీ ప్రజలకు శుభవార్త...! మూడు రోజులు పాటు ఆ జిల్లాలకు వర్షాలు
ఏపీ ప్రజలకు శుభవార్త…! మూడు రోజులు పాటు ఆ జిల్లాలకు వర్షాలు

Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనము , తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించిన ద్రోణి ప్రభావంతో  రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు పడతాయి అని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

దీని ప్రభావంతో సోమవారం నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. చెట్ల క్రింద నిలబడరాదని హెచ్చరించారు. రైతులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఉత్తర కోస్తాలో సోమవారం :- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి , రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు కొన్ని చోట్ల సంభవించే అవకాశముంది అన్నారు. ఈదురు గాలులు గంటకు 30-40 ఒక్కో సమయంలో గరిష్ఠంగా 50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి అని అన్నారు. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది

మంగళవారం :- రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి , రెండు చోట్ల కురిసే అవకాశముంది అన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు కొన్ని చోట్ల సంభవించే అవకాశముంది అన్నారు. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి అన్నారు.

దక్షిణ కోస్తాలో , సోమవారం :- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి , రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు కొన్ని చోట్ల సంభవించే అవకాశముంది అన్నారు. ఈదురు గాలులు గంటకు 30-40 ఒక్కో సమయంలో గరిష్ఠంగా 50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి అని అన్నారు. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది అన్నారు.

మంగళవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి అన్నారు.

రాయలసీమ :-  సోమవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.

మంగళవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *