రైలు నెంబర్ 07220 తిరువన్నామలై నుంచి నర్సాపూర్ వరకు ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఉదయం 11 గంటలకు తిరువన్నామలైలో బయలుదేరితే, మధ్యాహ్నం 2.25 గంటలకు తిరుపతికి, శుక్రవారం వేకువజామున 2 గంటలకు నర్సాపూర్‌కి చేరుకుంటుంది. ఈ రైలు దారిలో వెల్లూరు, కాట్పాడి, చిత్తూరు, పాకాల, తిరుపతి, రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, పాలకొల్లు రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)



