Weather Update: ఏపీలో నిప్పుల కొలిమిలా మారిన వాతావరణం.. 73 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర ఎండ, శనివారం 73 మండలాల్లో తీవ్ర వడగాలులు 17 లో వడగాలులు, ఆదివారం 32 మండలాల్లో తీవ్ర వడగాలుల అవకాశం, అధికారులు జాగ్రత్తలు సూచించారు

ఏపీలో వడగలులు..! ప్రజల అప్రమత్తంగా ఉండాలంటే వాతావరణ శాఖ హెచ్చరిక
ఏపీలో వడగలులు..! ప్రజల అప్రమత్తంగా ఉండాలంటే వాతావరణ శాఖ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భానుడు భగభగమంటూ నిప్పులు కురిపిస్తున్నాడు. ఫిబ్రవరి మొదటి వారంలోనే బయటికి రావాలంటేనే భయపడిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు బయటకు రావద్దని అంటున్నారు. ప్రస్తుతం వాతావరణ అంచనాల ప్రకారం.

శనివారం 73 మండలాల్లో తీవ్రవడగాలులు, 17 మండలాల్లో వడగాలులు, ఆదివారం 32 మండలాల్లో తీవ్రవడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని  విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఎండ తీవ్రత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

శనివారం (04-04-26)  శ్రీకాకుళం జిల్లాలో 16, విజయనగరం 24, పార్వతీపురంమన్యం 15, అల్లూరి 3, పోలవరం 9, అనకాపల్లి 2, కాకినాడ 3, తూర్పుగోదావరి 1 మండలాల్లో తీవ్రవడగాలులు(73) వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. అలాగే శ్రీకాకుళం 2, పోలవరం 2, అనకాపల్లి 1, కాకినాడ 2, తూర్పుగోదావరి 3, ఏలూరు 4, ఎన్టీఆర్ 1, పల్నాడు 2 మండలాల్లో వడగాలులు(17) ప్రభావం చూపనున్నట్లు తెలిపారు.

శుక్రవారం మన్యం(జి) భామినిలో 41.8°C, చిత్తూరు(జి) రాయలపేటలో 41.4°C, అనకాపల్లి(జి) నాతవరంలో 40.9°C, శ్రీకాకుళం(జి) జి.సిగడాంలో 40.5°C, నంద్యాల (జి) ఆలమూరు, కడప(జి) బద్వేల్ లో 40.4°C, ఏలూరు(జి) ధర్మాజీగూడెం, తిరుపతి(జి) రేణిగుంట, విజయనగరం(జి) రాజాంలో 40.3°C,  కృష్ణా(జి) కంకిపాడులో 40.1°C, కర్నూలు(జి) తోవి 40°C చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

వడగాలుల వీస్తున్నందున మహిళలు, పిల్లలు, వృద్దులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజలు డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS, ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు. వచ్చేవారం రోజులపాటు ఇదే వాతావరణం ఉండే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *